Kodali Nani: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ (Congress) ప్రాపకం కోసం పాకులాడడం సరికాదని కామెంట్స్ చేశారు. పదిమంది పనికిమాలిన వెధవల్ని వేసుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల..ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల ఎలా చేరారు?: పద్మావతి
రాష్ట్రంలో ఏం జరగాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిల.. కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదని అన్నారు. ఎంపీగా కూడా గెలుస్తాడో లేదో తెలియని రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తాడని ప్రశ్నించారు. జీరో పర్సెంట్ ఓట్ల శాతం ఉన్న షర్మిల పార్టీ, ఒక శాతం పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ తో కలిస్తే ఏం జరుగుతుందని వ్యాఖ్యనించారు.
Also Read: దృశ్యం సినిమాను మించిన ట్విస్ట్.. రూ. 40 లక్షల భీమా కోసం ఎంత పనిచేశాడో తెలుసా?
రాజకీయ లబ్ధి కోసమే జగన్ (CM Jagan) పై, షర్మిల నిందలు వేస్తుందని దూయ్యబట్టారు. షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా?ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించిందా? 2019 ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా? గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని షర్మిల ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతుందని మండిపడ్డారు. ప్రతి పథకానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ ప్రభుత్వం పై నిందలు వేయడం దారుణం అని వ్యాఖ్యనించారు.