Kodali Nani: జూ.ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. బాలయ్యకు కొడాలి నాని కౌంటర్

జూ‌. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ స్పందించారు. లోకేష్ కోసం జూ‌. ఎన్టీఆర్ ను నాశనం చేయాలని బాలకృష్ణ చూస్తున్నాడని విమర్శలు గుప్పించారు. ఇలాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా జూ. ఎన్టీఆర్ వెంట్రుక కూడా ఊడదంటూ కామెంట్స్ చేశారు.

Kodali Nani: జూ.ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. బాలయ్యకు కొడాలి నాని కౌంటర్
New Update

Kodali Nani: హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూ‌. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు (Jr NTR Flex) తొలగించడంపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూ‌.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వల్ల ఎన్టీఆర్ వెంట్రుక ఊడిందా‌? అని ప్రశ్నించారు. నారా లోకేష్ కోసం జూ‌. ఎన్టీఆర్ ను నాశనం చేయాలని బాలకృష్ణ చూస్తున్నాడని విమర్శలు గుప్పించారు. ఇలాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా జూ. ఎన్టీఆర్ వెంట్రుక కూడా ఊడదంటూ కామెంట్స్ చేశారు.

దుర్మార్గపు ఆలోచనలు

ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్దాపించి 9 నెలల్లోనే అధికారంలో వచ్చారని.. నమ్ముకున్న కుటుంబం చేతిలో మోసపోయన ఎన్టీఆర్ మనోవేదనతో చనిపోయి నేటికి 28 ఏళ్లు అయిందన్నారు. బ్రతికున్నప్పుడు ఆయన్ని విమర్శించనవాళ్లే ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితికి ఎన్టీఆరే తీసుకువచ్చాడని అన్నారు. సిగ్గు శరం లేకుండా ఎన్టీఆర్ (NTR) ను చంపి ఆయన గ్రామానికి వచ్చి దండలేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పదవి నుండి దింపి చంపిన వ్యక్తులు దండలు వేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీని తెలంగాణలో నిర్మూలించారు.. ఏపీలో కూడా నిర్మూలిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబును (Chandrababu) రా కదిలిరా అని సుప్రిం కోర్ట్,.. రాజమండ్రి సెంట్రల్ జైల్ అంటుందని కౌంటర్ వేశారు. చంద్రబాబు సభకు జనాలు వస్తారా?..చంద్రబాబు హృతిక్ రోషనా జనాలు ఎగబడి రావడానికి.. చాలా మందిని జగన్ పీకేశాడని.. పార్టీలో ఉండమని పార్దసారధి దగ్గరకు వెళ్లి అడిగాం..వైసీపీ లో సీట్ ఇస్తామంటే వద్దు అని పక్క పార్టీలకు వెళతారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బిహేవియర్, సామాజిక సమీకరణలు నేపద్యంలో మార్పులు సహజం అని అన్నారు.

Also Read: వైసీపీలో నాలుగో జాబితా మీద నేతల్లో టెన్షన్…ఇంకా కొనసాగుతున్న కసరత్తులు

మార్పులు సహజం

తనపై పోటీగా చంద్రబాబు నలుగురిని మార్చాడని..చంద్రగిరిలో పోటి చేసి గెలిచిన చంద్రబాబు ట్రాన్స్ ఫర్ అయి కుప్పం ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. దేవినేని ఉమా, గద్దె, అంబటి బ్రాహ్మణయ్య, డీవై దాస్ లాంటివాళ్లని ఎక్కడ గెలిచినవాళ్లని మళ్లీ ఎక్కడ పోటి చేయించాడు? అని అడిగారు. లోకేష్ మంగళగిరిలో పుట్టాడా..? బాలకృష్ణ హిందుపూర్ లో పుట్టాడా..?.. రాజకీయ పార్టీలో‌ మార్పులు చాలా సహజం అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇంతే

ఈ క్రమంలోనే  కాంగ్రెస్ పార్టీ 1% ఓట్లు పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నుండి బయటకి వచ్చాక విజయమ్మ వైఎస్ వివేకా మీద గెలిచిందని అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా ఒక్కోపార్టీ నాలుగు నాలుగు ఓట్లు పోతాయని.. చంద్రబాబుకు కూడా నాలుగు ఓట్లు పొతాయని వ్యాఖ్యనించారు. తన భార్యను ఏదో అన్నాడని చంద్రబాబు అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడని..కానీ, టీడీపీ నేతలు మాత్రం మహిళా రిపోర్టర్ ను  ట్రోలింగ్ చెయోచ్చా అని ప్రశ్నించారు.

#kodali-nani #jr-ntr #balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe