Ex Minister Kodali Nani: అభివృద్ది పాలన ఎవరిదో....విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన సవాల్ పై విమర్శల గుప్పించారు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ట్విట్టర్ ‘X’లో చాలెంజ్‌లు చేస్తున్నాడని చురకలు అంటించారు.
మంచి జరిగితేనే..
సీఎం జగన్ (CM Jagan) చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారని అన్నారు కొడాలి నాని. మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ‘X’లో చాలెంజ్‌లు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
జగన్, చంద్రబాబు కాదు...
భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకులు మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? అని అన్నారు కొడాలి నాని. డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలని హితవు పలికారు. ఎవరు సీఎంగా ఉండాలో జగన్, చంద్రబాబు కాదుగా నిర్ణయించేది ......ప్రజలే న్యాయ నిర్ణేతలు అని పేర్కొన్నారు. తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు X లో ఛాలెంజ్‌లు చేసుకోవాలి.. ప్రజలు ఎన్నుకున్న జగన్‌తో కాదు అని చురకలు అంటించారు.
నాతో చర్చకు సిద్ధమా?..
నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? అని ప్రశ్నించారు కొడాలి నాని. సీఎం జగన్‌ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది అని అన్నారు. అందుకే మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి అంటూ సెటైర్లు వేశారు. ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్‌లు చెయ్యాలని అన్నారు.