Mahatma Gandhi Marriage: మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. నేడు మహాత్ముడి పుట్టిన రోజు(Gandhi Jayanthi). కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. "మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (Mohandas Karamchand Gandhi)" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కరంచంద్ గాంధీ, పుతలీ బాయి. గాంధీ చిన్న తనం నుంచి కూడా నిదానముగా ఉండే బాలుడు. గాంధీకి చిన్నతనంలో తన తల్లి చెప్పిన మాటలనే ఆయన కడ వరకు పాటించారు.
అబద్ధాలకు దూరంగా ఉండమని ఆయన తల్లి చెప్పిన మాటను ఆయన ఎన్నడూ పెడ చెవిన పెట్టలేదు. గాంధీ . తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. గాంధీకి చిన్నతనంలోనే కస్తూర్భాను (Kasturba Gandhi) ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగే సమయానికి గాంధీజీ వయసు కేవలం పదమూడు సంవత్సరాలు.
అప్పటి వారి సంప్రదాయం, ఆచారాల ప్రకారం వీరివురి పెళ్లి జరిగింది. వారికి నలుగురు సంతానం. వారు భార్యా భర్తలుగా 62 సంవత్సరాల పాటు కలసి జీవించారు. గాంధీ వివాహం జరిగే సమయానికి కఠియావాడ్ రాజ్యాలను పర్యవేక్షించే బ్రిటిష్ పొలిటికల్ ఏజెంట్ ఫెడరిక్ లెలో పోర్ బందర్ దివాన్ పదవి నుంచి గాంధీని తొలగించారు. ఆ స్థానంలో గాంధీ తన తమ్ముడిని ఉంచి ఆయన రాజ్‌కోట్ కి మకాం మర్చాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Gandhi Jayanti: నేడు గాంధీ జయంతి.. జాతిపిత గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
అక్కడ రెండేళ్లు పని చేసిన తరువాత ఆయన మళ్లీ దివాన్ పదవిలో చేరాడు. అందువల్ల గాంధీ కుటుంబం పోర్‌బందరు నుండి రాజ్‌కోట్ కు మారాల్సి వచ్చింది. పెళ్లి అయిన తరువాత కస్తూర్భా గాంధీ అనే కొత్త పేరుతో రాజ్ కోట్ లోని ఇంటికి ఆమె వచ్చింది. గాంధీ తల్లి పుత్లీ బాయి పాటించే ఆచారాలన్నింటిని కూడా గాంధీ భార్య అయినటువంటి కస్తూర్బాకు అప్పజెప్పినట్లు సమాచారం.
పూర్వీకుల ఆచారాలూ కట్టుబాట్లూ కచ్చితంగా పాటించాలి అనీ, అంటరాని వారిని ఇళ్ళలోకి రానివ్వరాదు అనీ తమ ఇంటి పెద్దలు కస్తూర్బాకి తెలిపినట్టు గాంధీ తన శిష్యురాళ్లు తెలిపినట్లు వినికిడి. కొంతకాలానికి గాంధీ ఆరోగ్య పరిస్థితి బాలేనందున రాజ్‌కోట్ దివాన్ పదవిని కూడా ఆయన కోల్పోవలసి వచ్చింది.
గాంధీ కుటుంబానికి దివాన్ గిరీ తప్ప వేరే వ్యాపారాలు ఏవీ లేకపోవడం వల్ల కరంచంద్ గాంధీని కుంగుబాటుకు గురి చేశాయి. వారి వారసత్వం ప్రకారం దివాన్ గిరీ చేయడానికి ముగ్గురు కొడుకులున్నారు. కానీ ఆ కాలంలో ప్రభుత్వ జీవోలు, గజెట్లు అర్థం చేసుకోవడానికి దివాన్ కు తప్పని సరిగా ఇంగ్లీష్ రావాలనే నిబంధన విధించారు.
గాంధీజీ సోదరులకు ఎవ్వరికీ చదువు సరిగా రాకపోవడం ఇంగ్లీష్ చదువుకొని మళ్లీ దివాన్ గిరీ ఉద్యోగం పొందడమే లక్ష్యంగా గాంధీ కుటుంబానికి మారింది. కానీ గాంధీ ఏం చదువుతున్నాడు అనే విషయం కస్తూర్బాకు తెలియదు. పెళ్ళి అయిన కొత్తలో కస్తూర్‌కి తాను అక్షరాలు నేర్పించడానికి ఏకాంతంలో ప్రయత్నించినా ఆమె ఆసక్తి చూపలేదని 50 యేళ్ళ తరువాత గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.
పెళైన కొత్తలో గాంధీజీ కూడా ఆమె పై దర్పం చూపించేవాడు. ఆమె ఎప్పుడూ కూడా తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకునే వాడు. గాంధీ కస్తూర్బాకు పెళ్లైన కొత్తలో పదే పదే ఆంక్షలు విధించేవాడు. "అత్తగారూ, తోడికోడళ్ళూ నన్ను తోడుకోసం పిలిచినప్పుడు నేను నా భర్త అనుమతి తీసుకోవాలి అని వాళ్ళతో చెప్పాలా? నేను అలా అన్నటికీ చెప్పను. వాళ్ళేమన్నా వాళ్ళ భర్తల దగ్గర అనుమతి తీసుకుంటున్నారా?" అని కస్తూర్ అనడం మోహన్‌దాస్ కోపం రావడానికి కారణమైంది.
1985 నవంబరు 16న గాంధీ తండ్రి కరంచంద్ గాంధీ మరణించాడు. ఇది జరిగిన నాలుగు రోజులకు మరో విషాదం గాంధీ కుటుంబాన్ని కమ్మేసింది. నవంబరు 20న కస్తూర్బాకి పుట్టిన మగ బిడ్డ నాలుగు రోజులు కూడా జీవించకుండా కన్ను మూసాడు. తన క్రమశిక్షణా రాహిత్యం వల్లే ముందస్తు ప్రసవం జరిగి బిడ్డ చనిపోయినట్లు అనంతర కాలంలో మోహన్‌దాస్ గాంధీ ఆత్మకథలో పశ్చాత్తాపం వ్యక్తం చేసాడు.
ఆమె మామగారు కరంచంద్ గాంధీ మరణం తర్వాత ఆమె కుటుంబంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కరంచంద్ గాంధీ పెద్ద కుమారుడు లక్ష్మీదాస్ గాంధీ తన చిన్న తమ్ముడి చదువు మీద పూర్తి దృష్టి కేంద్రీకరించాడు. తమకు వంశపారంపర్యంగా వస్తున్న దివాన్ హోదాని తిరిగి పొందాలంటే చిన్న తమ్ముడు మోహన్‌దాస్ గాంధీ ఇంగ్లీష్ లో పట్టభద్రుడు కాక తప్పదు. అంతకు ముందు గాంధీజీ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీజీని ఐదేళ్ళ డిగ్రీ కోర్సులో చేర్పించారు.
కానీ భారతదేశంలో ఈ విధంగా మరో ఐదేళ్ళపాటు చదివినప్పటికీ ఇంగ్లీష్ న్యాయశాస్త్రం తెలియకపోతే దివాన్‌గిరీ దక్కదు అని తెలిసింది. ఇంగ్లండ్‌లో మెట్రిక్యులేషన్ స్థాయిలో మూడేళ్ల న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. కానీ గాంధీ సముద్రం దాటి పరాయి దేశం వెళ్లటం వల్ల "మోద్ బనియా సమాజం" ధర్మబ్రష్టత్వాన్ని పొందుతుందనీ, అందువల్ల ఇంగ్లండ్ వెళ్ళే నిర్ణయం విరమించుకోవాలనీ మోద్‌బనియా పెద్దల పంచాయితీ తీర్మానించింది. కానీ గాంధీ ఇంగ్లండ్ ప్రయాణాన్ని మానుకోక పోవడంతో ఆ కుటుంబాన్ని వెలివేసారు.
1888 నుండి 1891 వరకు పోర్‌బందరు బనియా సమాజం నుండి వెలివేసిన కారణంగా వారి కుటుంబం ఆర్థిక సంక్షోభంలోపడింది వెలివెసిన కారణంగా ఎవరూ గాంధీ కుటుంబానికి సహాయానికి రాలేదు. ఆ పరిస్థితులలో కస్తూర్బా తాను పుట్టింటి నగలను అమ్మి అతని చదువు కొనసాగడానికి దోహదపడింది. "నా భార్య నగలపై నా దృష్టి పడింది. నా భార్య నగలు అమ్మితే రెండు మూడు వేల రూపాయలు వస్తాయనీ వాటిని అమ్మి ఇంగ్లండ్ వెళతానని" గాంధీజీ తన ఆత్మకథలో రాసాడు.
భర్త విదేశీ విద్య కోసం తన పుట్టింటి వారు పెట్టిన నగలను కస్తూర్బా త్యాగం చేసింది. మిగిలిన డబ్బులు గాంధీ అన్న లక్ష్మీదాస్ సమకూర్చాడు. 1891 జూలై 5న గాంధీజీ విద్యాభ్యాసం ముగించుకుని భారతదేశానికి వచ్చాడు. దానితో గాంధీ కుటుంబం మళ్ళీ బనియా సమాజంలో కలిసింది. బారిష్టరు చదువు పూర్తి చేసినప్పటికీ గాంధీజీకి దివాన్ పదవి రాలేదు. కస్తూర్బా నగలు పోగా మూడేళ్ల లండన్ చదువు కోసం పెట్టిన 13వేల రూపాయల అప్పు మిగిలింది గాంధీకి.
ఇక న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టాడు. 1992లో ముంబాయి కోర్టుకు వెళ్ళి ఆరు నెలల పాటు చెట్టు కింద ప్లీడరుగా గడిపాడు. 1992 అక్టోబరు 28న కస్తూర్బా దంపతులకు మణిలాల్ జన్మించాడు. ఈ ఆర్థిక సంక్షోభానికి ఒక పరిష్కారంగా దక్షిణాఫ్రికాలో దాదా అబ్దుల్లా అనే గుజరాతీ వ్యాపారికి చెందిన ఒక కంపెనీకి న్యాయవాదిగా పనిచేసే అవకాశం రావడంతో 1993లో మళ్ళీ భారతదేశం వదిలి పెట్టాల్సి వచ్చింది.
గాంధీజీ తన భార్య కస్తూర్బాను ఇద్దరు కొడుకులు హరిలాల్, మణిలాల్ లను రాజ్‌కోటలోని ఉమ్మడి కుటుంబంలో వదిలిపెట్టి ఒంటరిగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ న్యాయవాద వృత్తి బాగా సాగడంతో వరుసగా మూడేళ్లపాటు ఉండిపోయాడు.