Rohit Vemula : రోహిత్ వేముల సూసైట్‌ నోట్‌లో ఏముంది..

రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు క్లీన్ చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్‌ వేముల తాను ఆత్మహత్య చేసుకునే ముందు.. సూసైడ్‌ లెటర్‌లో ఏం రాశాడో తెలియాలంటే ఈ ఫుల్‌ ఆర్టికల్‌ చదవండి.

Rohit Vemula : రోహిత్ వేముల సూసైట్‌ నోట్‌లో ఏముంది..
New Update

Suicide Note : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) లో రోహిత్ వేముల(Rohit Vemula) ఆత్మహత్య దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2016 జనవరిలో రోహిత్ సూసైడ్ చేసుకోగా.. దీని వెనుక కుల వివక్షే కారణమని పలువురు అగ్రవర్ణాలకు చెందినవారిపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ముగించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. యూనివర్సిటీ వీసీ అప్పారావు(VC Apparao) కు కూడా ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే అసలు రోహిత్ వేముల ఎస్సీ కాదని పేర్కొన్నారు.

Also Read: భార్యను కొట్టి చంపిన ఆర్థిక మంత్రి.. వీడియో వైరల్

తనది ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్ అని తేలితే సాధించిన డిగ్రీలు కోల్పోవడంతో పాటు.. శిక్ష పడుతుందనే భయంతో సూసైడ్ చేసుకొని ఉండొచ్చని తమ రిపోర్టులో చెప్పారు. దీంతో హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

రోహిత్ వేముల తాను ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్‌ నోట్‌లో ఏం రాశాడో ఇప్పుడు చుద్దాం

శుభోదయం,
మీరు ఈ ఉత్తరం చదివినప్పుడు మీ చుట్టు నేను ఉండను. నా మీద కోప్పడకండి. మీలో కొందరు నన్ను నిజంగా పట్టించుకున్నారు, ప్రేమను చూపించారు, నన్ను చాలా బాగా చూసుకున్నారని నాకు తెలుసు. ఎవరిపైనా నాకు ఫిర్యాదులు లేవు. నా సమస్యలే ఎప్పటికీ నాతోనే ఉన్నాయి. నా ఆత్మ, శరీరానికి మధ్య దూరం పెరుగుతున్నట్లు నేను భావిస్తున్నాను. నేను రాక్షసుడిగా మారిపోయాను. నేనెప్పుడూ కూడా రచయితను కావాలని అనుకున్నాను. కార్ల్ సాగన్ వంటి సైన్స్ రచయితగా అవ్వాలనుకున్నాను. చివరికీ.. నేను ఈ ఉత్తరం మాత్రమే రాస్తున్నాను.

నేను సైన్స్, నక్షత్రాలు, ప్రకృతిని ఇష్టపడ్డాను. కానీ ప్రజలు చాలా కాలం నుంచి ప్రకృతి నుంచి విడిపోయారని తెలియకుండానే నేను వారిని ప్రేమించాను. మన భావాలు అనేవి సెకండ్ హ్యాండెడ్. మన ప్రేమ నిర్మించబడింది. మన నమ్మకాలకు రంగు పులుముకుంది. కృత్రిమ కళ ద్వారా మన వాస్తవికత చెల్లుతుంది. బాధపడకుండా ప్రేమించడమనేది నిజంగా కష్టంగా మారింది.

మనిషి విలువ అనేది కులంతో గుర్తించే స్థితికి దిగజారిపోయింది. ఆ మనిషికి కూడా ఓ మనసుంటుందని గుర్తించడంలేదు. ఒక ఓటుగా, అంకెగా, వస్తువుగానే మనిషిని చూస్తున్నారు. ప్రతి రంగంలోనూ, చదువులోనూ, వీధుల్లోనూ, రాజకీయాల్లోనూ, చావు, బ్రతుకులోను ఇదే పరిస్థితి ఉంది. నేను మొదటిసారిగా ఇలాంటి ఉత్తరం రాస్తున్నాను. ఇదే నా చివరి లేఖ. నన్ను నేను అర్థం చేసుకోవడంలో విఫలమైతే నన్ను క్షమించండి. నా పుట్టుక అనేది.. నా ప్రాణాంతక ప్రమాదం. నా చిన్ననాటి ఒంటరితనం నుంచి నేను ఎప్పటికీ కోలుకోలేను. నా గతం నుంచి నేను ప్రశంసించబడని పిల్లవాడిని.

ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో నేను తప్పు చేసి ఉండొచ్చు. ప్రేమ, బాధ, జీవితం, మరణం అర్థం చేసుకోవడంలో.. ఎలాంటి అత్యవసరమూ లేదు. కానీ నేను ఎప్పుడూ పరుగెత్తేవాడిని. జీవితాన్ని ప్రారంభించాలనే తపన ఉండేది. కొందరికి జీవితమే శాపం. ఈ క్షణంలో నేను బాధపడటం లేదు. నేను విచారంగా లేను. నేను ఖాళీగా ఉన్నాను. నా గురించి పట్టించుకోలేదు. అది దయనీయమైనది. అందుకే నేను ఇలా చేస్తున్నాను.

నేను వెళ్లిపోయిన తర్వాత ప్రజలు నన్ను పిరికివాడిగాగా అభివర్ణించవచ్చు. నాది స్వార్థం లేదా మూర్ఖత్వమని అనుకోవచ్చు. నన్ను ఎలా పిలిచినా దాని గురించి నేను బాధపడటం లేదు. నేను మరణానంతర కథలు, దెయ్యాలు లేదా ఆత్మలను నమ్మను. నేను విశ్వసించేది ఏదైనా ఉంటే.. నేను నక్షత్రాల వైపు ప్రయాణించగలనని నమ్ముతాను. ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటాను.

ఈ ఉత్తరం చదువుతున్న మీరు నాకోసం చేయగలిగింది ఏదైనా ఉందటే.. నాకు 7 నెలల ఫెల్లోషిప్, లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు రావాలి. దయచేసి నా కుటుంబానికి ఆ జీతం వచ్చేలా చూడండి. నేను రామ్‌జీకి 40 వేలు ఇవ్వాలి. అతను తిరిగి అడగలేదు. దయచేసి అతనికి రావాల్సిన డబ్బును అందులో నుంచి చెల్లించండి. నా అంత్యక్రియలు నిశ్శబ్దంగా, సాఫీగా జరగనివ్వండి. నేను ఇప్పుడే కనిపించి వెళ్లిపోయినట్లు ప్రవర్తించండి. నా కోసం కన్నీళ్లు పెట్టకండి. నేను జీవించి ఉండటం కంటే చనిపోయినందుకు సంతోషంగా ఉన్నానని తెలుసుకోండి.

"నీడల నుండి నక్షత్రాల వరకు."

ఉమా అన్నా, మీ గదిని ఈ పనికి వాడుకున్నందుకు క్షమించండి.

ASA కుటుంబానికి, మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమించండి. మీరు నన్ను చాలా ప్రేమించారు. మీ భవిష్యత్తు కోసం ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాను.
చివరిగా ఒక్క సారి,

జై భీమ్

ఫార్మాలిటీస్ రాయడం మర్చిపోయాను. నన్ను నేను చంపుకునే ఈ చర్యకు ఎవరూ బాధ్యులు కారు.

ఈ చర్యకు నన్ను ఎవరూ ప్రేరేపించలేదు. నేను ఈ పనిచేసేందుకు వారి చర్యలు లేదా వారి మాటలు కారణం కాదు.

ఇది నా నిర్ణయం, దీనికి నేను మాత్రమే బాధ్యత వహిస్తాను.

నేను పోయిన తర్వాత ఈ విషయంలో నా స్నేహితులను,శత్రువులను ఇబ్బంది పెట్టకండి.

publive-image

Also Read: రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు : రేవంత్

#rohit-vemula #rohit-vemula-suicide #rohit-vemula-suicide-letter-in-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe