Reason Behind Heart Strokes: ఇటీవలి కాలంలో చాలా మంది ఉన్నట్లుండే గుండెపోటుకు(Heart Stroke) గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్(Gym) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, డ్యాన్స్ చేస్తుండగా స్ట్రోక్ వచ్చి చనిపోయవడం వంటి ఘటను ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. 16 ఏళ్ల వయస్సు పిల్లలు కూడా గుండెపోటుకు గురై చనిపోవడం తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఆరోగ్యంగా, నవ్వుతూ ఉన్నవారు.. ఒక్కసారిగీ తీవ్రమైన స్ట్రోక్‌తో కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో విగత జీవులుగా మారిపోతున్నారు. మరి ఈ ఆకస్మిక మరణాలకు కారణం ఏంటి? వృద్ధుల్లో మాత్రమే వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న పిల్లలు మొదలు.. యుక్త వయసుల వారిలో ఎందుకొస్తుంది? దేశ వ్యాప్తంగా ఇప్పుడే టాపిక్‌పై బిగ్ డిస్కర్షన్ నడుస్తోంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా తరువాత ఎంతో మంది నటులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు, చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురై విగతజీవులుగా మారుతున్నారు. రెండ్రోజుల క్రితం కూడా ఓ వ్యక్తి జీమ్ చేస్తూ చేస్తూనే గుండెపోటుకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను షేర్ చేసిన వికాస్ కుమార్ అనే డాక్టర్.. చిన్న వారికే ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది వివరిస్తూ కీలక ట్వీట్ చేశారు. కరోనా కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని, కొన్ని చర్యలు పాటిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు. మరి డాక్టర్ వికాస్ ఏం చెప్పారో ఓసారి తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Heart Strokes: 45 ఏళ్ల లోపు వారికి గుండెపోటు రావడానికి కారణం ఇదే.. సంచలన వివరాలు వెల్లడించిన డాక్టర్..!
వీడియోను షేర్ చేసిన వికాస్ కుమార్ అనే డాక్టర్.. చిన్న వారికే ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది వివరిస్తూ కీలక ట్వీట్ చేశారు.
Translate this News: