Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ మహమ్మారి ఎలా సోకుతుంది?

నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందింది. బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? మహిళలకు ఇది ఎంత ప్రమాదకరం? అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ మహమ్మారి ఎలా సోకుతుంది?

Cervical cancer: సర్వైకల్ క్యాన్సర్.. దీనిమీద పెద్ద చర్చే నడుస్తోంది. దీనిని రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు. ప్రముఖ సినీనటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో అకస్మాత్తుగా మృతి చెందిన వార్త కలకలం రేపింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సరైకాల్ క్యాన్సర్ బారిన పడకుండా 9-18 సంవత్సరాల బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఇది ఏ రకంగా ప్రమాదాన్ని తెస్తుంది. దీనికోసం బాలికలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం ఎందుకు ఇలాంటి అంశాలలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలకు సమాధానాలు తెలుసుకుందాం. 

ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పుకోవాలి. బడ్జెట్ లో చెప్పిన అంశాల్లో అత్యంత ముఖ్యమైన అంశం 9-18 ఏళ్ల సంవత్సరాల లోపు బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌(Cervical cancer) కు సంబంధించిన టీకా ఉచితంగా ఇస్తామని చెప్పడం. అవును.. ఇది చాలా కీలకమైన పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క కోవిడ్ కాలంలో మినహా ఎప్పుడూ ఉచితంగా టీకాలు అందించలేదు. 5 సంవత్సరాలు దాటిన తరువాత ఎవరైనా.. ఏదైనా టీకా వేయించుకోవాలి అంటే దానిని కొనుక్కుని వేసుకోవాల్సిందే. మన దేశంలో 0-5 సంవత్సరాల మధ్యలో పిల్లలకు ఇచ్చే టీకాలు మాత్రమే ఉచితం ఇప్పటిదాకా. కానీ, మొదటి సరిగా 5-14 సంవత్సరాల బాలికల కోసం సర్వైకల్‌ క్యాన్సర్‌(Cervical cancer) టీకాలను ఉచితంగా ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇది మన దేశంలోని కోట్లాదిమంది బాలికలకు.. చాలా ఊరట నిచ్చే.. వారి ప్రాణాలను కాపాడే పథకం అని చెప్పవచ్చు. 

సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటే.. 

అసలు సర్వైకల్‌ క్యాన్సర్‌(Cervical cancer) అంటే ఏమిటో తెలుసుకుంటే.. ఈ పథకం ఎంత ముఖ్యమైనదో అర్థం అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటే మనం సాధారణంగా చెప్పుకునే గర్భాశయ క్యాన్సర్. ఇది చిన్నతనంలో అంటే 9-18 ఏళ్ల సంవత్సరాల బాలికల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వలన వస్తుంది. ఇది చిన్నతనంలో సోకిన విషయం కూడా బయటపడదు. వయసు పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్ పెరుగుతూ పోతుంది. 30 ఏళ్ల వయసులో సాధారణంగా బయటపడుతుంది. ఒక్కోసారి బాగా ముదిరిపోయిన తరువాత అంటే.. దాదాపు మరణం అంచులు చేరిన తరువాత ఈ క్యాన్సర్ బయటపడటం జరుగుతుంది. ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధిలో ఐదో అతిపెద్ద వ్యాధి ఈ సర్వైకల్ క్యాన్సర్. అలాగే మన దేశంలో ప్రణాంతకంగా పరిణమించే రెండో అతి పెద్ద క్యాన్సర్ వ్యాధి ఇది. 

Also Read: Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు.. మరి డిజిటల్ పేమెంట్స్ మాటేమిటి? 

భారతదేశంలో దాదాపు 365.71 మిలియన్ల మంది 15 ఏళ్లు పైబడిన మహిళలు ఉన్నారు.  వీరికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం భారతదేశంలో ఏటా దాదాపు 132,000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి.. దాదాపుగా  74,000 మరణాలు సంభవిస్తున్నాయి.  ఇది ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ మరణాలలో దాదాపు 1/3 వంతుగా ఉంది. ఏ సమయంలోనైనా, సాధారణ జనాభాలో దాదాపు 6.6% మంది మహిళలు గర్భాశయ HPV సంక్రమణను కలిగి ఉంటారని అంచనా. 

ఈ లెక్కలు విన్నారుగా.. ఇప్పుడు అర్థం అయిందిగా ఈ వ్యాధి ఎంత ప్రమాదమైనదో. దీనివల్ల ఏటా ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారో. బాలికల్లో అంటే 9-18 సంవత్సరాల వయసు మధ్యలో టీకా ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా బాలికలకు నివారణ తీసుకురావచ్చు.  అందుకే, ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రకటించిన అతిపెద్ద.. ముఖ్యమైన పథకంగా దీనిని చెప్పడం జరిగింది. 

ఈ వ్యాధి లక్షణాలు ఇవీ (Cervical cancer symptoms).. 

ఈ వ్యాధి మొదటి దశలో ఉన్నపుడు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ.. వ్యాధి ముదిరిన కొద్దీ లక్షణాలు బయటపడతాయి. పీరియడ్స్ కి పీరియడ్స్ కి మధ్యలో రక్త స్రావం కావడం, లైంగిక కలయిక తరువాత, మోనోపాజ్ తరువాత యోని నుంచి రక్తస్రావం కావడం, అలాగే దుర్వాసనతో ఉన్న నీరు, రక్తపు ద్రవాలు యోని నుంచి కారడం, ఇక లైంగిక కలయిక సందర్భంగాలో పెల్విక్ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

 చికిత్స ఇదీ.. 

ప్రస్తుతం దీనికి ల్యాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. దీనివలన కట్ చేయడం.. కుట్లు వేయడం వంటి పరిష్టితి రాదు. సాధారణంగా ఈ క్యాన్సర్ వైరస్ సోకిన తరువాత 10 నుంచి 15 సంవత్సరాలకు క్యాన్సర్ గా మారుతుంది. అందువల్ల పెళ్లి అయిన తరువాత మహిళలు ఏడాదికి ఒకసారి పాప్‌స్మియర్‌ టెస్ట్‌ చేయించుకుంటే క్యాన్సర్ ను ప్రాథమికంగా నిర్ధారించడం సాధ్యం అవుతుంది. అలాగే 9-18 ఏళ్ల వయసులో బాలికలకు వ్యాక్సిన్ వేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ను నివారించే అవకాశము ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ఉచితంగా బాలికలకు ఇవ్వడం కోసం ప్రతిపాదనలు తీసుకువచ్చింది. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు