Tax Savings: ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 చివరి క్వార్టర్ లోకి ప్రవేశించ బోతున్నాం. టాక్స్ పేయర్స్ లో టెన్షన్ మొదలైనట్లే. వీరికి గందరగోళం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు టాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనలో అందరూ ఉన్నారు. టాక్స్ ఎలా ఆదాచేయాలి అనే ప్లాన్.. కొత్త, పాత ఏ విధానంలో పన్ను చెల్లింపు ఎంచుకోవాలి అనేది తేల్చుకోవడంతో ప్రారంభం అవుతుంది. సరైన విధానం ఎంచుకున్న తరువాత టాక్స్ సేవింగ్స్ కోసం ఏమి చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇక టాక్స్ ఆదా చేసుకోవడం కోసం పెట్టుబడి ఎక్కడ పెడితే మంచిది అనే విషయం గురించి చూస్తే కనుక అందుకోసం కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా టాక్స్ సేవింగ్స్ మాత్రమే కాకుండా భవిష్యత్ లో ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అవేమిటో చూద్దాం..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ముందుగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF గురించి తెలుసుకుందాం. PPF లో పెట్టుబడిపై వచ్చే రాబడి పై పన్ను ఉండదు. అలాగే దీనిలో రిస్క్ చాలా తక్కువ . ప్రస్తుతం పీపీఎఫ్‌లో వార్షిక వడ్డీ 7.1 శాతంగా ఉంది . పాత పన్ను విధానంలో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద PPF లో పెట్టుబడిపై రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు(Tax Savings) లభిస్తుంది.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లో అంటే ELSS , ఈక్విటీ ఆధారిత ఉత్పత్తులలో డబ్బు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించవచ్చు . పన్ను ఆదా చేయడానికి - అధిక రాబడిని పొందడానికి ఇది మంచి ఎంపిక . ఈఎల్‌ఎస్‌ఎస్‌లో రాబడులు స్థిరంగా ఉండవని గుర్తుంచుకోండి. ఇది 3 సంవత్సరాల లాక్ - ఇన్‌ను కలిగి ఉంది , ఇది ఇతర పన్ను ఆదా ఎంపికలతో పోల్చితే అతి తక్కువ లాక్ ఇన్ పిరియడ్. అందువల్ల కొద్దిగా రిస్క్ చేయడానికి ఇష్టపడితే, ఇందులో ఇన్వెస్ట్ చేయడం టాక్స్ ఆదాతో(Tax Savings) పాటు మంచి ఆదాయమూ వచ్చే అవకాశం ఉంటుంది.
జాతీయ పెన్షన్ స్కీం..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే NPS అనేది పన్ను ఆదా(Tax Savings) చేయడం - వృద్ధాప్యంలో అవసరం కోసం కార్పస్ ఏర్పాటు చేసుకోవడానికి.. రెండింటికీ మంచి ఎంపిక . ఇందులో పెట్టుబడి పెడితే, రూ. 50,000 అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది 80సి కింద రూ. 1.5 లక్షల తగ్గింపు కంటే ఎక్కువ . మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, రూ. 50,000 అదనపు మినహాయింపు అందుబాటులో ఉండదు. అయితే , మీరు పదవీ విరమణ కోసం మంచి కార్పస్ ను ఏర్పాటు చేసుకోగలుగుతారు.
నిపుణులు ఏమంటారంటే..
మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నా లేదా కొత్తదాన్ని ఎంచుకున్నా , ఆర్థిక భద్రత కోసం ఖచ్చితంగా టర్మ్ - హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి . పాత పన్ను విధానంలో, సెక్షన్ 80C - 80D కింద దీనిపై మినహాయింపు లభిస్తుంది . కష్ట సమయాల్లో ఈ రెండూ ఉపయోగపడతాయి . PPF లో డిపాజిట్ చేసిన డబ్బును మెచ్యూరిటీ లేదా పదవీ విరమణకు ముందు విత్‌డ్రా చేయకూడదని గుర్తుంచుకోండి . సెక్షన్ 80C లో పన్ను ఆదా చేసే ఇటువంటి అనేక ఖర్చులు ఉన్నాయి . వీటిలో పిల్లల విద్యా రుసుములు , హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ , కొత్త ప్రాపర్టీ కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి . ఇది కాకుండా , EPF లో మీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది . ఈ విషయాల కారణంగా 80C పరిమితిని చేరుకున్నట్లయితే, దాని క్రింద మరింత పెట్టుబడి పెట్టవద్దు .
Watch this interesting Video: