Flannan Isles: ఇదొక అంతుచిక్కని మిస్టరీ!అక్కడి కి వెళ్లాలంటేనే వణికిపోతారు..అదే హంటర్ ఐలాండ్స్!

స్కాట్లాండ్‌లో సముద్రం మధ్యలో ఉండే ఏడు ఐలాండ్స్‌కి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు అక్కడివాళ్లు. అక్కడికి వెళ్లినవాళ్లంతా మాయమైపోవడమే దానికి గల కారణం. అందుకే వాటికి ‘సెవన్ హంటర్స్ ఐలాండ్స్’ అని పేరు పెట్టారు. అసలక్కడ ఏం జరుగుతుందంటే..

New Update
Flannan Isles: ఇదొక అంతుచిక్కని మిస్టరీ!అక్కడి కి వెళ్లాలంటేనే వణికిపోతారు..అదే హంటర్ ఐలాండ్స్!

Flannan Isles Mystery: స్కాట్లాండ్‌ సముద్రతీరానికి సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ‘ఫ్లానన్ ఐల్స్’ అనే ఏడు ఐలాండ్స్ ఉండేవి. ఆ ఐలాండ్స్ అంటే అక్కడి వాళ్లకు భయం. అయితే సెవన్ హంటర్స్ ఐలాండ్స్‌లోని ఇలియన్‌మోర్ అనే ద్వీపంలో 300 మీటర్లు ఎత్తు ఉండే లైట్ హౌస్ టవర్ కట్టాలని 1896లో స్కాట్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ ఐలాండ్‌లో పనిచేయడం కష్టమని.. టవర్ కట్టొద్దని అక్కడివాళ్లు ఎంత చెప్పినా వినకుండా కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టారు.

ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్ర‌యాణం ఆ లైట్‌ హౌస్‌కి కాపలాగా నలుగురు కీపర్స్‌ను పెట్టారు. వాళ్ల కోసం అందులోనే ఒక కిచెన్, రెస్ట్ రూమ్ కూడా కట్టారు. వాళ్లు చేసేదేమీ లేక భయపడుతూనే అక్కడ ఉండేవాళ్లు. అటువైపుగా ఏవైనా షిప్స్ వెళ్తున్నప్పుడు లైట్ హౌస్‌ నుంచి సిగ్నల్స్ ఇవ్వడం వాళ్ల పని. ఇదిలా ఉండగా 1900వ సంవత్సరం డిసెంబర్‌ నెలలో .. హెస్పారస్‌ అనే ఒక బోట్‌.. ఇలియన్‌మోర్‌ ఐలాండ్‌కు బయలుదేరింది. లైట్‌ హౌస్‌కు దగ్గరగా చేరుకునే టైంకి షిప్ సెయిలర్ .. లైట్ హౌస్ సిగ్నల్ కోసం చూశాడు. కానీ, లైట్ హౌస్ పైన అసలు లైటే కనిపించలేదు. ఐలాండ్‌కు దగ్గరగా వెళ్లి చూస్తే.. లైట్ హౌస్ పైన స్కాట్‌లాండ్ జెండా కూడా లేదు. హారన్స్ మోగించి, ఫ్లేర్ గన్ ద్వారా ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చినా.. లైట్ హౌస్ నుంచి రెస్పాన్స్ రాలేదు. తీరా ఐలాండ్ కు వెళ్లి చూస్తే.. అక్కడ ఎవరూలేరు. గదులన్నీ మూసి ఉన్నాయి. కీపర్లు ఏమయ్యారో తెలియదు. దాంతో వాళ్లపై మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి వెతకడం మొదలుపెట్టారు.

publive-image

కీపర్లు మిస్ అయిన తర్వాత పోలీసులు ఐలాండ్‌ చుట్టు పక్కలంతా గాలించారు. వాళ్ల ఆచూకి ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత లైట్‌హౌస్‌ లాగ్‌బుక్‌ చూస్తే.. అందులో డిసెంబర్ 12వ తేదీలో ‘మునుపెన్నడూ చూడని విధంగా పెద్ద పెద్ద గాలులు వీస్తున్నాయి. ఇక్కడ అందరూ ఏడుస్తున్నారు. సీనియర్ కీపర్ డీలా పడిపోయాడు’ అని రాసి ఉంది. తర్వాతి పేజీల్లో డిసెంబర్‌ 15వ తేదీన ‘తుఫాను ముగిసింది’ అని కూడా రాసి ఉంది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ తేదీల్లో ఎలాంటి తుఫానులు రాలేదని స్కాట్లాండ్ అధికారులు గుర్తించారు. దాంతో ఆ ఐలాండ్‌లో అసలేం జరిగింది అనేది మిస్టరీగా మిగిలిపోయింది.

కీపర్లు మాయమైన చాలా ఏళ్ల తర్వాత1950లో మైక్‌ డ్యాష్ అనే హిస్టారియన్.. ఇలియన్ ఐలాండ్‌ మిస్టరీలపై చాలా స్టడీ చేశాడు. సముద్రమట్టానికి వంద అడుగుల ఎత్తులో ఉంది. కాబట్టి.. అంతకు మించిన ఎత్తులో సముద్ర కెరటాలు ఎగసిపడి ఉంటాయని, దానివల్లనే అక్కడికి వెళ్లిన వాళ్లంతా మిస్ అయ్యి ఉండొచ్చని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అయితే అందులో ఎంతవరకూ నిజం ఉందో స్పష్టంగా తెలియదు. మొత్తానికి ఆ ఐలాండ్స్‌లో ఇప్పటివరకూ ఎంతోమంది మిస్ అయ్యారు. ముఖ్యంగా ఆ లైట్ హౌస్‌లోని ముగ్గురు ఎలా మాయం అయ్యారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే.

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం. ముగ్గురు భారతీయులు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు