IT Returns Filing: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. వీటిని గమనించకపోతే దొరికిపోతారు!

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఇప్పుడు హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరలో జరిగే ఏదైనా పొరపాటు జరిమానాలు కట్టే పరిస్థితి తీసుకురావచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

IT Returns Filing: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. వీటిని గమనించకపోతే దొరికిపోతారు!
New Update

IT Returns Filing : మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? లేదా? లాస్ట్ డేట్ దగ్గరపడిపోయింది. వెంటనే ఫైల్ చేసేయండి. ఇదిగో ఇలా చెప్పగానే హడావుడిగా ఎదో అయిపోయిందిలే పని జరిగిపోవాలి.. అంటూ కంగారుగా రిటర్న్స్ ఫైల్ చేసేశారంటే ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా చివరి క్షణంలో IT Returns Filing చేసేటప్పుడు ఈ 10 విషయాలను గుర్తుంచుకోండి.  లేకపోతే నోటీసు ఇంటికి వస్తుంది. వివిధ వర్గాల టాక్స్ పేయర్స్ కు వేర్వేరు ITR ఫారమ్‌లు ఉంటాయి. టాక్స్ పేయర్స్  ITR 1 నుండి ITR 7 వరకు అన్ని ఫారమ్‌లను చెక్ చేసుకుని మీకు సరైన ఫారం ద్వారా రిటర్న్‌ను ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన 10 పాయింట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మీరు మీ ITRని గడువు తేదీ జూలై 31లోపు ఫైల్ చేశారని నిర్ధారించుకోండి. గడువును కోల్పోవడం జరిమానా -వడ్డీకి దారి తీయవచ్చు.
  2. ఇందాకే చెప్పినట్టు వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు ITR ఫారమ్‌లు ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు ITR 1 నుండి ITR 7 వరకు అన్ని ఫారమ్‌లను చెక్ చేసుకుని మీకు సరిపడే ఫారం ద్వారా రిటర్న్‌ను ఫైల్ చేయాలి.
  3. ఫారమ్ 16, సోర్స్ టాక్స్ డిడక్ట్ చేసిన (TDS) సర్టిఫికేట్, ఇంట్రస్ట్ సర్టిఫికేట్, ఇన్వెస్ట్మెంట్ రుజువు అలాగే ఇతర అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ను  ఫైల్ చేయడానికి ముందు రెడీ చేసుకోండి. 
  4. అన్ని TDS - పే చేసిన టాక్స్ వివరాలు  సరిగ్గా కనిపిస్తున్నాయని కంఫర్మ్ చేసుకోవడానికి మీ టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్  అంటే ఫారమ్ 26AS క్రాస్-చెక్ చేయండి. ఏదైనా డిఫరెన్స్ లు ఉంటె అవి మీరు రిటర్న్స్ ఫైల్ చేసే ముందుగానే క్లియర్ అవ్వాలి. 
  5. మీరు శాలరీ, ఇంట్రస్ట్, రెంట్ ఇన్ కామ్, క్యాపిటల్ గెయిన్స్  అలాగే  ఏదైనా ఇతర ఇన్ కమ్  సహా అన్ని ఆదాయ వివరాలను రికార్డ్ చేసినట్టు కన్ ఫర్మ్ చేసుకొండి. 
  6. 80C, 80D, 80G - ఇతర విభాగాల క్రింద అన్ని అర్హత తగ్గింపులు - మినహాయింపులను ఉపయోగించండి. ప్రతి దానికి  సరైన డాక్యుమెంటేషన్ ఉందని నిర్ధారించుకోండి.
  7. మీరు ముందుగా పూరించిన ITR ఫారమ్‌ను ఉపయోగిస్తుంటే, ముందుగా పూరించిన డేటా ఖచ్చితత్వాన్ని ధృవీకరించండి. ఐటీఆర్ ఫైల్ చేసేముందుగానే ఏవైనా లోపాలు ఉంటె కరెక్షన్ చేసుకోవాలి. 
  8. మీకు ఏవైనా విదేశీ ఆస్తులు ఉంటే లేదా విదేశాల నుండి ఆదాయాన్ని ఆర్జిస్తే, అవి మీ ITRలో ఖచ్చితంగా రికార్డ్ అయినట్టు నిర్ధారించుకోండి. అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోతే. దానికోసం మీపై ఫైన్ విధించే అవకాశం ఉంది. 
  9. మీ ITR ఫైల్ చేసిన తర్వాత, దాన్ని ఇ-వెరిఫై చేయడం మర్చిపోవద్దు. మీరు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇ-వెరిఫై చేసుకోవచ్చు.
  10. మీ ITR ఫైల్ చేసి, వెరిఫై అయిన తర్వాత, రిసిప్ట్ అంటే ITR-Vని సేవ్ చేయండి. ఇది ఫైలింగ్ రుజువుగా పనిచేస్తుంది. అలాగే, ఫ్యూచర్లో ఏదైనా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

అదండీ విషయం అర్ధం అయింది కదా. ఏదోకరణాలతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం చివరి నిమిషం వరకూ కుదరకపోయి ఉండవచ్చు. అలా అని చివరి నిమిషంలో కంగారుగా ఫైల్ చేసి ఇబ్బందులు పడవద్దు. జాగ్రత్తగా అన్నిటినీ పరిశీలించుకుని.. మీ ఫైనాన్షియల్ ఎడ్వాయిజర్ సూచనలతో ఐటీఆర్ ఫైల్ చేయండి. ఇబ్బందులు నివారించుకోండి.

Also Read : విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది?





#it-returns #itr-filing
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe