Dandruff: డాండ్రఫ్‌తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి చాలు..

చలికాలం వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. దీని నుంచి బయటపడాలంటే విటమిన్-బి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పచ్చి కూరగాయల సలాడ్లు, పండ్లు రోజువారి భోజనంలో చేర్చవడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి.

Dandruff: డాండ్రఫ్‌తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి చాలు..
New Update

చలికాలం వచ్చిందంటే జ్వరాలు, దగ్గులు, జలుబులు రావడం సహజమే. వీటితో పాటు చుండ్రు సమస్య కూడా చాలామందికి ఉంటుంది. దీనివల్ల మాడు పొడిబారం, దురద కలగడం లాంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ చుండ్రు సమస్య ఎక్కవైతే.. చివరికి వెంట్రుకలు కూడా రాలిపోతాయి. జుట్టు కూడా చాలావరకు పలచబడిపోతుంది. అందుకే చండ్రు సమస్యను ఎంత వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలని చాలామంది అంటుంటారు.

Also read: యవ్వనంలో గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల సంతానం కలగడం కష్టం అవుతుందా?

అయితే ఈ డాండ్రఫ్ రావడానికి గల కారణాలు చాలా ఉంటాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం, అధికంగా చెమట పట్టడం, కాలుష్యం, వాతావరణ మార్పులు ఇలా రకారకాల సమస్యలతో ఈ సమస్యలు వస్తుంటాయి. ఇలా ఎలాంటి కారణాలతో చుండ్రు సమస్య వచ్చినా కూడా కొన్ని టిప్స్ పాటించి దాని నుంచి బయటపడొచ్చు. అయితే ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. సాధారణంగా హెయిర్‌ డ్రయర్‌ వినియోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగులుతుంది.

అధిక వేడి అనేది చుండ్రు సమస్య తీవ్రతను పెంచేస్తుంది. అందుకే పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవడం మంచింంది. విటమిన్-బి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పచ్చి కూరగాయల సలాడ్లు, పండ్లు రోజువారి భోజనంలో చేర్చాలి. అరటిపండ్లు, పాలకూర వంటి పోషకాలుండే ఆహారాలను తీసుకోవడం మంచింది. మరోవిషయం ఏంటంటే మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచుగా జుట్టును దువ్వుతూ ఉండాలి. దీనివల్ల మాడులో నూనెలు ఉత్పత్తి అయ్యి చుండ్రు సమస్య తగ్గుతుంది.

Also Read: పిల్లలను పడుకోబెట్టేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

#health-tips #telugu-news #dandruff
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe