Kejriwal: 'అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం' అన్న వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్‌ !

అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు.అయితే ఆ సమయంలో ఆయన అవినీతి కేసులో తానే అరెస్ట్ అవుతానని ఊహించి ఉండరు.

Kejriwal: 'అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం' అన్న వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్‌ !
New Update

Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) ను ఈడీ అధికారులు (ED) అరెస్టు చేశారు. దాదాపు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 4గంటల పాటు కేజ్రీవాల్ ను విచారించిన అనంతరం ఈడీ అరెస్టు చేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి కాకముందు కేజ్రీవాల్ 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' (India Against Curruption) అనే ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. అయితే ఆ సమయంలో ఆయన అవినీతి కేసులో తానే అరెస్ట్ అవుతానని ఊహించి ఉండరు.

'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమం

'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమాన్ని అన్నా హజారే ప్రారంభించారు, అందులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాన భాగమయ్యారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా రాజకీయాల్లోకి రాకముందు చాలా కాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 2006లో, అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు. ప్రభుత్వంపై కఠినమైన అవినీతి నిరోధక చట్టాలను విధించి దోషులను కటకటాల వెనక్కి నెట్టడమే 'అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం' ఉద్యమం ముఖ్య లక్ష్యం.

అన్నా ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు 
అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, లోక్‌పాల్ బిల్లును డిమాండ్ చేస్తూ అన్నా హజారే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో వందలాది మంది మద్దతుదారులతో 2011 లో నిరాహార దీక్షకు దిగారు. సామాజిక కార్యకర్తలు అన్నా హాజారే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ‘నేనూ అన్నా’ అనే క్యాప్ ధరించి అవినీతి వ్యతిరేక పోరాట యాత్రలో కేజ్రీవాల్‌ కూడా చేరిపోయాడు. అవినీతికి సంబంధించి అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాతావరణం ఏర్పడిన కాలం అది.

ఉద్యమం తర్వాత రాజకీయాల్లోకి 
28 ఆగస్టు 2011న, అన్నా హజార్ తన 13 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అవినీతిని నిర్మూలించాలంటే రాజకీయాల్లోకి రావడమే ప్రధాన మార్గామని కేజ్రీవాల్ భావించారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కొందరు కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్ కు సవాలు కూడా విసిరారు.

26 నవంబర్ 2012న పార్టీ

దీంతో రాజకీయాల్లోకి వస్తే అవినీతిని కూకటి వేర్లతో సహా నిర్మూలించవచ్చు అనుకున్నకేజ్రీవాల్‌ ... అక్టోబర్ 2, 2012న రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్‌ 26న ఆమ్‌ ఆద్మీ పార్టీ ని స్థాపించారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి తొలిసారిగా 70 స్థానాలకు గానూ 28 స్థానాల్లో విజయం సాధించింది. కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ప్రభుత్వం 49 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 70 సీట్లకు 67 వచ్చాయి. బంపర్ విజయం తర్వాత కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా...

ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో తన ఉనికిని విస్తరించడం ప్రారంభించింది. ఏప్రిల్ 10, 2023న ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ఇచ్చింది. వాస్తవానికి, ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలోనే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిగి ఉన్న మూడవ పార్టీ. ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, గుజరాత్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. అది కూడా అక్కడ బీజేపీ నేతలపై ఆప్‌ నేతలు విజయాన్ని సాధించారు. పంజాబ్‌ నుంచి ఒక లోక్‌సభ ఎంపీ కూడా ఉన్నారు. ఆప్‌కి ఢిల్లీ నుంచి ముగ్గురు, పంజాబ్‌ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.

2006లో ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచి..

అరవింద్ కేజ్రీవాల్ 1968లో హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. కేజ్రీవాల్ ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. కొన్ని రోజులు టాటా గ్రూపు కంపెనీలో పనిచేశారు. 1992లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో రెవెన్యూ అధికారిగా చేరారు. 2006లో ఇక్కడి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొంది పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోను స్థాపించి ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించేందుకు, సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు.

Also read: ప్రతి రోజూ ఖాళీ కడుపుతో రెండు ఈ ఆకులను తిన్నారంటే..!

#delhi #liquor-scam #kejriwal #anna-hajare
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe