/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/knife-jpg.webp)
Knife Attack In Marriage Function : కడప (Kadapa) కమలాపురం అప్పాయపల్లి సీఎస్‌ఐ చర్చి వద్ద గురువారం జరిగిన పెళ్లి వేడుకల్లో (Marriage Function) ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కృష్ణయ్య ఏసన్న అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు. ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన వీరి మధ్య మాటా మాటా పెరిగి ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కమలాపురం పోలీసులు గాయపడిన ఏసన్నను ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు!