Asia cup: టీమిండియా సెలక్షన్ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌పై విమర్శల దాడి ఆగడంలేదు. ఆసియా కప్‌కు గాయంతో బాధపడుతున్న వారిని సెలక్ట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడాన్ని పలువురు మాజీ ఆటగాళ్లు తప్పుపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరుతో మ్యాచ్ సమయంలో గాయపడ్డ రాహుల్ ఇటివలే గాయం నుంచి కోలుకున్నాడు. అయితే అలా రీకవర్ అయ్యాడో లేదో మరో సారి గాయపడ్డాడు. ఇదే విషయాన్ని అజిత్ అగార్కర్ సైతం స్పష్టం చేశాడు. ఇప్పుడు ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తూ అజిత్ అగార్కర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు.
ఇలా ఎలా సెలక్ట్ చేస్తారు సార్?
ఆసియా కప్ టీమ్‌ని అనౌన్స్ చేసిన కొద్ది గంటలకే అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశాడు. రాహుల్‌కి మరోసారి గాయం అయ్యిందని.. ఆసియా కప్‌లో మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని చెప్పాడు. ఇది విని షాక్ అయ్యిన శ్రీకాంత్ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ 'చీకీ చీకా'లో అజిత్‌పై మండిపడ్డాడు. ఎంపిక చేసే సమయంలో ఆటగాడు ఫిట్‌గా లేనప్పుడు అసలు ఎందుకు సెలక్ట్ చేశారని ప్రశ్నించారు. గాయం చిన్నదా పెద్దదా అన్నది మేటర్ కాదని.. సెలక్షన్ జరిగే రోజు ఆటగాడు ఫిట్‌గా లేకపోతే అసలు ఎంపిక చేయకూడదన్నాడు శ్రీకాంత్.
ఇది కరెక్ట్ కాదు బ్రో:
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లకు ఆసియా కప్‌కు ఎంపిక చేశారు. ఈ ఇద్దరి ఆటగాళ్లు త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్ కప్‌కు కీలకం అని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఆసియా కప్‌లో పరీక్షించాలనుకుంది. కానీ గాయంతో ఉన్న ఆటగాడిని పూర్తిగా కోలుకోకుండా బరిలోకి దింపితే గాయం తిరగబెట్టే అవకాశాలే ఎక్కువ. గతంలో బుమ్రా విషయంలోనూ బీసీసీఐ ఇదే తప్పు చేసిందన్న విమర్శలున్నాయి. అటు పేసర్ ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేయడాన్ని కూడా శ్రీకాంత్ తప్పుపట్టాడు. ఏడాది కాలంగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ప్రసిద్ద్ కృష్ణను వన్డే ఫార్మెట్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించాడు శ్రీకాంత్. ఐర్లాండ్‌తో టీ20 ఆడడం.. ఆసియా కప్ ఆడడం ఒకటి కాదన్నాడు శ్రీకాంత్. టీ20ల్లో నాలుగు ఓవర్ల స్పెల్ మాత్రమే ఉంటుందని గుర్తు చేశాడు. ఇలా అజిత్ అండ్ కో పై శ్రీకాంత్ తరహాలో పలువురు మాజీలు, అభిమానులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.
Asia cup: గాయంతో ఉండగానే సెలక్ట్ చేస్తారా? అసలు మైండ్ ఉందా? మాజీ క్రికెటర్ ఫైర్!
ఆసియా కప్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. కేఎల్ రాహుల్‌కి కొత్త గాయం అవ్వగా అది తెలిసినా కూడా అతడిని సెలక్ట్ చేశారు. మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని సెలక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పడు. ఇలా గాయంతో ఉన్నవారిని ఎలా ఎంపిక చేస్తారని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించారు.
New Update
Advertisment