KL Rahul - Athiya Shetty : కేఎల్ రాహుల్ - ఆతియా శెట్టి దంపతుల గొప్ప మనసు.. వారి కోసం 'క్రికెట్ ఫర్ ఎ కజ్' పేరుతో ఛారిటీ.!

క్రికెట్ దిగ్గజం కేఎల్ రాహుల్ - అతియా శెట్టి దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. బాలల సంక్షేమానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారు 'క్రికెట్ ఫర్ ఎ కజ్' అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా సేకరించిన నిధులను విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు.

KL Rahul - Athiya Shetty : కేఎల్ రాహుల్ - ఆతియా శెట్టి దంపతుల గొప్ప మనసు.. వారి కోసం 'క్రికెట్ ఫర్ ఎ కజ్' పేరుతో ఛారిటీ.!
New Update

KL Rahul - Athiya Shetty :  బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెట్ దిగ్గజం కేఎల్ రాహుల్ తమ దాంపత్య జీవితంలో మరో ముఖ్యమైన అడుగు వేశారు. బాలల సంక్షేమానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారు 'క్రికెట్ ఫర్ ఎ కజ్' అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు.

ఈ ఫౌండేషన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ప్రత్యేక అవసరాలతో ఉన్న పిల్లల కోసం ఒక స్కూల్‌ను నడుపుతోంది.అతియా శెట్టి ఈ ఫౌండేషన్‌తో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని పంచుకున్నారు. ఆమె చిన్నప్పటి నుంచి ఈ ఫౌండేషన్‌తో అనుబంధం ఉందని, ఇక్కడి పిల్లలకు బోధించడం, వారితో సమయం గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేదని తెలిపారు. తన నానమ్మ ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌కు తాను మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Also Read : ఒలింపిక్ ఆర్చరీ క్వార్టర్స్‌లో దీపికా కుమారి!

కాగా ఈ కార్యక్రమానికి భారతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లితో పాటు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు మద్దతు తెలిపారు. వీళ్ళతో పాటూ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్వింటన్ డి కాక్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఈ ఫౌండేషన్ కు సపోర్ట్ చేయడం విశేషం.

#kl-rahul-athiya-shetty
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe