సాగునీటి కోసం గోకివాడలో రైతుల స్వల్ప ఉద్రిక్తత మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు.. రాష్ట్రంలో కాస్త చిన్న చినుకులు పడటంతో కొద్దిగా ఉపసమనం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు ఖరీఫ్ కోసం నీరు దొరికిదని సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ నీటి కోసం మరో కొంతమంది రైతులు నిరసన తెలుపుతున్నారు. క్రాఫ్ హాలిడే ఫ్లెక్సీతో మదుమ్ డ్యాం వద్ద కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడలోని రైతులు నీటికోసం నిరసన చేస్తున్నారు. By Vijaya Nimma 08 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కినీడి వారి చెరువు పుట్టకొండ కాలువ ఉన్నా లాకులు తొలగిస్తూండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఘటన వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. తోపులాటలో కొందరు రైతులతో సహా గ్రామ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు కాలువలో పడిపోయారు. అయితే స్పృహ కుల్పోయిన గ్రామ సర్పంచ్‌ని అక్కడే వదిలేసిన అధికారులు వెళ్లిపోయ్యారు. రైతులను చెల్లా చెదరగొట్టిన పోలీసులు, స్పృహ కోల్పోయిన సర్పంచ్‌ను పట్టించుకోకుండా వదిలేశారని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులే లాకులు కట్టేందుకు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే తీయిస్తూన్నారని రైతులు మండిపడ్డారు. రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. లాకులు తొలగిస్తే ..చుక్కనీరు ఉండదు గోకివాడలో నీటికోసం ఉదయం రైతులు నిరసన చేశారు. క్రాఫ్ హాలిడే ఫ్లెక్సీతో మదుమ్ డ్యాం వద్ద రైతులు ఆందోళన దిగారు. అయితే అక్కడ అక్కినీడి వారి చెరువుకు ఉన్న లాకులు తొలగిస్తే క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని అధికారులకు రైతులు హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు చెక్కలకు బదులు ఇనుప లాకులు ఏర్పాటు చేశారని ఆందోళన చేస్తున్నారు. పిఠాపురం మండలం రాపర్తి చెందిన రైతుల వాదనలో వాస్తవం లేదని రైతులు వాదిస్తున్నారు. రైతుల విన్నపం రాపర్తి గ్రామస్తులు రాజకీయ ఉద్దేశంతో తొంలగించే ప్రయత్నం చేస్తున్నారని గోకివాడ రైతులు ఆరోపణ చేశారు. లాకులు తొలగిస్తే గోకివాడ పంటపొలాలకు నీరు చుక్క ఉండదని అంతా కిందకు పోతుందని రైతుల ఆవేదన చెందుతున్నారు. లాకులు తొలగించే నిర్ణయం మానుకోవాలని అధికారులకు గోకివాడ రైతులు విన్నపం చేశారు. సాగునీటి వివాదం అయితే గతంలో తాము ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకే బల్లలు తొలగించి ఇనుప లాకులు ఏర్పాటుచేశామని వారు తెలిపారు. ఇప్పుడు వాటిని తొలగిస్తామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. లాకులు తొలగిస్తే గోకివాడ గ్రామ ఆయకట్టుకు చుక్క నీరు అందదని, పంటపొలాలు అన్ని బీడుభూమలుగా మారతాయని వారు అందోళన వ్యక్తంచేశారు. మొత్తం సాగునీరు అంతా దిగువ ప్రాంతాలకు పోతుందని వారు తెలిపారు. మాకు గత్యంతరం లేదు ఇదే జరిగితే తమకు క్రాప్‌హాలీడే ప్రకటించడం మినహా గత్యంతరం లేదని స్పష్టం చేశారు. లాకులు తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గోకివాడ, రాపర్తి గ్రామాల మధ్య ఉన్న సాగునీటి వివాదం శుక్రవారం తీవ్రరూపం దాల్చింది. గోకివాడ రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగడంతోపాటు లాకులు తొలగిస్తే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.ఈ ఆందోళనలో పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి