Smell : ఈ మధ్య కాలం చాలా మంది వంటగది(Kitchen) లో చెక్క పాత్రలు వాడడం బాగా ట్రెండ్ అవుతుంది. వంటగదిలో ఉపయోగించే ఈ చెక్క పాత్రలు అనేక ఇతర ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. స్టైలిష్(Stylish) గా కనిపిస్తాయి, ఉపయోగించడానికి సులభమైనవి, తేలికగా వేడెక్కవు, విరిగిపోవు , నాన్-స్టిక్(Non-Stick) పాత్రలకు కూడా ఇవి సరైనవిగా పరిగణించబడతాయి. అయితే వాటిని శుభ్రంగా ఉంచుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడతారు. మీ ఇంట్లోని చెక్క పాత్రలు కూడా ఏళ్ల తరబడి కొత్తవిగా కనిపించాలంటే.. వాటిని శుభ్రంగా, నీట్‌గా ఉంచడానికి ఈ సులభమైన చిట్కాలను ఫాలో అవ్వండి.
చెక్క పాత్రలను శుభ్రం చేసే చిట్కాలు
మసాలా మరకలు
ఈ చెక్క పాత్ర(Wooden Utensils) లకు పసుపు లేదా మసాలా దినుసులకు సంబంధించిన మరకలు క్లీన్ చేయడానికి.. ఒక కప్పులో రెండు చెంచాల నిమ్మరసం తీసుకుని, అందులో సమానమైన బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత పాత్రను తయారు చేసుకున్న మిశ్రమంతో కడగాలి. బ్రష్ లేదా స్కాచ్ బైట్ సహాయంతో మరకపై పూర్తిగా అప్లై చేసి స్క్రబ్ చేయండి. పాత్రల నుండి మరకలు మాయమవుతాయి.
చెడు వాసనను ఎలా తొలగించాలి
ఒక పెద్ద పాత్రలో నీటిని నింపి అందులో అరకప్పు వెనిగర్ వేయాలి. ఇప్పుడు పాత్రలను ఈ నీటిలో ఉంచండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత, ఈ పాత్రలను బయటకు తీసి దానిపై నిమ్మకాయ, బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేసి రుద్దండి. పాత్రలు శుభ్రం కావడంతో పాటు వాటిలోని వాసన మాయమవుతుంది.
చెక్క పాత్రలు పొడిబారడాన్ని ఇలా నిర్వహించండి
చెక్క పాత్రలను రోజూ శుభ్రపరచడం ద్వారా.. అవి క్రమంగా పొడిగా మారతాయి. వాటి రంగు మారడం కూడా ప్రారంభమవుతుంది. దీని కోసం, నెలకోసారి తేలికపాటి డిటర్జెంట్‌తో పూర్తిగా శుభ్రం చేసి, నీటితో తుడిచిన తర్వాత మినరల్ ఆయిల్ లేదా వెన్నను అప్లై చేయండి. ఈ విధంగా వాటి తేమ అలాగే ఉంటుంది. అలాగే విరిగిపోవు.