Kitchen Tips: మీ కిచెన్‌ జిడ్డుగా ఉందా?..ఇలా సులభంగా క్లీన్‌ చేయండి

కిచెన్ సింక్ శుభ్రంగా ఉంచకపోతే దుర్వాసనతోపాటు ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కోసిన నిమ్మకాయలో ఉప్పు, బేకింగ్ సోడాను నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్ వంటి వస్తువులను ఉపయోగించి సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.

Kitchen Tips: మీ కిచెన్‌ జిడ్డుగా ఉందా?..ఇలా సులభంగా క్లీన్‌ చేయండి
New Update

Kitchen Tips: గృహిణులు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు. రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి ఇంటి సభ్యులను సంతోషపెట్టడం ఎంత ముఖ్యమో వంటగది శుభ్రత కూడా అంతే ముఖ్యం. కిచెన్ సింక్ శుభ్రంగా ఉంచకపోతే దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా రంగు కూడా మారిపోతుంది. కొన్ని వస్తువులను ఉపయోగించి సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. గిన్నెలు కడుక్కోవాలనే తొందరలో అవాంఛిత ఆహారం సింక్‌లో చేరి బ్లాక్‌ అవుతుంది. సరిగ్గా శుభ్రం చేయకపోతే సింక్ చాలా మురికిగా మారుతుంది. కాబట్టి ఈ వస్తువులలో కొన్నింటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సింక్ శుభ్రతను కాపాడుకోవచ్చు.

వేడి నీటిని వాడండి:

  • సింక్ నల్లగా ఉంటే వేడి నీటితో కడగడం వల్ల జిడ్డు పోతుంది. అంతేకాకుండా పైపులో ఉన్న చెత్త కూడా తొలగిపోతుంది. కాకపోతే స్టీల్‌తో చేసిన సింక్‌ అయితే మాత్రమే వేడినీళ్లు వాడాలని నిపుణులు అంటున్నారు.

బ్లాక్‌ని ఇలా తొలగించండి:

  • సింక్ బ్లాక్ అయితే డ్రెయిన్ స్నేక్ కేబుల్‌ను సింక్ పైపు లోపల ఉంచి బ్లాక్ అయిన చెత్తను తొలగించవచ్చు. నీళ్లు పోసుకుంటూ ఇలా చేయడం వల్ల సులభంగా చెత్త వెళ్తుంది.

నిమ్మతో సింక్‌ని శుభ్రం చేయండి:

  • అందరి వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే నిమ్మకాయను ఉపయోగించి సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. కోసిన నిమ్మకాయలో ఉప్పు కలిపి రుద్దితే సింక్ మురికి పోయి మెరుస్తుంది.

వెనిగర్, బేకింగ్ సోడా:

  • సింక్ బ్లాక్ అయినట్లయితే వెనిగర్, బేకింగ్ సోడాను సింక్ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్ వేసి కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత సింక్‌లో వేడి నీళ్లతో కడిగేయాలి.

బేకింగ్ సోడా:

  • బేకింగ్ సోడాను నీళ్లలో మిక్స్ చేసి సింక్‌లో వేసి కాసేపు అలాగే ఉంచి నీళ్లతో కడిగి కాటన్ క్లాత్‌తో తుడిస్తే సింక్ మెరుస్తుంది.

ఆలివ్ ఆయిల్:

  • సింక్ మురికిగా, రంగు మారితే కాస్త ఆలివ్ ఆయిల్‌ను ఒక గుడ్డపై వేసి సింక్‌ తుడిస్తే జిడ్డు పోతుంది. స్టీల్ సింక్ అయితే ప్రకాశవంతంగా మెరుస్తుంది.

ఇది కూడా చదవండి: వేసవి తాపాన్ని తగ్గించే వట్టివేరు ఉపయోగాలు తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#kitchen-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe