Kishan Reddy: కాంగ్రెస్ నిజస్వరూపం ఇదే: కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం నిన్న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శలు చేశారు. By Jyoshna Sappogula 02 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy: ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా.. మరి నిన్ననే ఒకటో తేది. ఇది ఫిబ్రవరి నెలే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది. మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదు’ అని కేంద్రమంత్రి గుర్తు చేశారు. Also Read: తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ.. జై అమరావతి అంటూ నినాదాలు..! హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శలు గుప్పించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. Also Read: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, నిన్న నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు సంధించారు. ఇచ్చిన హామీలు ఎగరగొడుతూ నిత్యం ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ దేనని విమర్శలు గుప్పించారు. #bjp-kishan-reddy #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి