Kiran Abbavarm: "మీ ఆశీస్సులు మాకు కావాలి" పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ వివాహం ఆగస్టు 22న అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా నటుడు కిరణ్ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి" అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

Kiran Abbavarm:  "మీ ఆశీస్సులు మాకు కావాలి" పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కిరణ్ అబ్బవరం
New Update

Kiran Abbavarm Marriage: టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఆగస్టు 22న నటి రహస్య గోరక్ తో కలిసి ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువురి తొలి సినిమా 'రాజాగారు రాణివారు ' సినిమాతో ఏర్పడిన కిరణ్, రహస్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట ఈ ఏడాది మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిన్న ఆగస్టు 22న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.

కిరణ్ అబ్బవరం పోస్ట్

అయితే తాజాగా నటుడు కిరణ్ అబ్బవరం తమ పెళ్లి పోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫొటోలను షేర్ చేస్తూ.. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు, సన్నిహితులు కిరణ్, రహస్య జంటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

publive-image

publive-image

publive-image

publive-image

#actor-kiran-abbavaram-marriage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe