/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-26-8.jpg)
Kiran Abbavarm Marriage: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఆగస్టు 22న నటి రహస్య గోరక్ తో కలిసి ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువురి తొలి సినిమా 'రాజాగారు రాణివారు ' సినిమాతో ఏర్పడిన కిరణ్, రహస్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట ఈ ఏడాది మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిన్న ఆగస్టు 22న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
కిరణ్ అబ్బవరం పోస్ట్
అయితే తాజాగా నటుడు కిరణ్ అబ్బవరం తమ పెళ్లి పోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫొటోలను షేర్ చేస్తూ.. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు, సన్నిహితులు కిరణ్, రహస్య జంటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
We Need all your blessings ❤️🙏 pic.twitter.com/3ibTFUuJp0
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 23, 2024