/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-21T113800.596.jpg)
Kiran Abbavaram Marriage: హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రేపు (ఆగస్టు 22న) ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. తన తొలి సినిమా 'రాజావారు రాణిగారు' హీరోయిన్ రహస్య గోరఖ్ తో ఏడడుగులు వేయబోతున్నారు. ఆ సినిమాతో ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట రీసెంట్ గా మార్చి 13న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.
కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్ అబ్బవరం పెళ్లి
ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్ లో జరగబోయే వీరి వివాహ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు మొదలయ్యాయి. రహస్య బంధువులు అంతా అక్కడే ఉండడంతో పెళ్లి కూడా అక్కడే చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం.. 1979 నేపథ్యంలో పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'క' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్' మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
View this post on Instagram