Kidney diseases in children:కిడ్నీలు మానవ శరీరంలో కీలకమైన భాగం .కిడ్నీల పని తీరు మీదే ఆరోగ్యం ఆధారపడి వుంటుంది.అయితే .. ఈ కిడ్నీసంబంథిత వ్యాధులు చిన్న పిల్లల్లో కూడా వస్తూ ఉండటం చూస్తూ ఉంటాం.మరి.. పిల్లల్లో ఈ మూత్రపిండాల వ్యాధులు (Kidney diseases) వచ్చే ముందు సంకేతాలు ఏంటి ? వాటిని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి?
పిల్లలలో కిడ్నీ వ్యాధులు
చాలా మంది పిల్లలు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే చాలా బద్ధకంగా ఉంటారు . ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. పెద్ద వారికీ చెప్పుకోలేరు. అలాంటప్పుడే వారిని గుర్తించి వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. పిల్లలో ప్రతీ కదలికను గుర్తించి వారి మూత్రం రంగును ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వారికి మూత్రనాళంలో ఏమయినా మంట వస్తుందా ? మూత్రం పోసేటప్పుడు అసౌకర్యంగా ఉందా అనే విషయాలను ఓపిగ్గా అడిగి తెలుసుకోవాలి. USలోని పరిశోధకులు నిర్వహించిన 2022 అధ్యయనంలో పిల్లలలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఒకటని చెప్పడం జరిగింది. మూత్ర మార్గము అంటువ్యాధులు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ (మూత్రంలో అధిక ప్రోటీన్ ఉండటం) మరియు బలహీనమైన మూత్రపిండాలు పిల్లలలో అత్యంత సాధారణ మూత్రపిండ వ్యాధులపట్ల జాగ్రత్త వహించాలి/.
పిల్లలలో కిడ్నీ వ్యాధులు: వాటిని ఎప్పుడు గుర్తించవచ్చు?
హైడ్రోనెఫ్రోసిస్, పాలిసిస్టిక్ లేదా మల్టీసిస్టిక్ కిడ్నీ వ్యాధి, అసాధారణ మూత్రపిండ భ్రమణం (Twisted kidneys) మరియు మూత్రపిండ అజెనెసిస్ (ఒకటి లేదా రెండు మూత్రపిండాలు లేకపోవడం) వంటి కొన్ని మూత్రపిండ సమస్యలు పుట్టుకతో వచ్చే లోపాలు. అటువంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలు ప్రినేటల్ టెస్టింగ్ దశలో లేదా గర్భాశయంలోని దశలో గుర్తించబడే నిర్మాణ లోపాలను ముందుగా గుర్తించి తగిన చికిత్సలు తీసుకోవాలి.
ఇక.. ఇందుకు విరుద్ధంగా మూత్రం ఇన్ఫెక్షన్లు, బలహీనమైన మూత్రపిండాలు , నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు పిల్లలు పుట్టిన తర్వాత రాను రాను వ్యాధి ముదురుతుంది. కిడ్నీ సంబంధిత నిర్మాణ లోపాలు, మూత్ర మార్గంలో(urinary tract)అంటువ్యాధులు పిల్లలు పుట్టినప్పటి నుండి వారు ఎదుగుతున్న క్రమంలో (1.5 నుండి 10 సంవత్సరాల వయస్సులో) నెఫ్రోటిక్ సిండ్రోమ్ కనిపిస్తుంది
పిల్లలలో మూత్రపిండ వ్యాధి యొక్క ప్రారంభ సంకేతాలు
తల్లిదండ్రులు తమ పిల్లలలో కొన్ని సంకేతాలను గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు, ఎందుకంటే అవి మూత్రపిండ ఇన్ఫెక్షన్(Kidney infection)యొక్క ప్రారంభ సూచికలు కావచ్చు,
కళ్ళు మరియు శరీరం యొక్క ఉబ్బరం
మూత్ర విసర్జన సమయంలో నొప్పి.
మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీలో ఆకస్మిక పెరుగుదల
మూత్రంలో రక్తం
అధిక రక్త పోటు
ఎత్తు తగ్గటం
అధిక శరీర బరువు
బలహీనమైన లేదా వంగిన ఎముకలు
అధిక-స్థాయి జ్వరం (కొన్ని సందర్భాల్లో)
రోగ నిర్ధారణ మరియు చికిత్స
చాలా కిడ్నీ సమస్యలు ప్రాణాంతకం కానప్పటికీ, మొదట్లోనే రోగ నిర్ధారణ చాలా ముఖ్యం. రోగనిర్ధారణ కోసం పరీక్షలు వ్యాధి లక్షణాలను బట్టి మారుతుంటాయి, (Blood tests, urine tests, renal ultrasound )రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు , మూత్రపిండ అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు కిడ్నీ సమస్యలను గుర్తించడానికి .చేసే పరీక్షలు .అయితే . బిడ్డ గర్భంలో ఉన్నదశలలో జన్యు పరీక్ష పిల్లలలో ఉన్న నిర్దిష్ట పరిస్థితిని నిర్ధారించడంలో సహాయపడుతుంది.
నివారణ చర్యలు
మూత్రం పోయకుండా బలవంతంగా ఆపుకోవద్దని సలహా ఇస్తున్నారు వైద్యనిపుణులు. పిల్లలు రోజంతా పుష్కలంగా నీళ్లు తాగేలా ప్రోత్సహించాలని వైద్యులు అంటున్నారు. రక్తపోటు -ప్రేరిత మూత్రపిండాల సమస్యలను నివారించడానికి తరచుగా మూత్రవిసర్జన, జన్యుపరమైన ఇబ్బందులున్న పిల్లలకు రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి .పిల్లలలో మూత్రవిసర్జన సమయంలో నొప్పి, తరచుగా మూత్రవిసర్జన, అధిక శరీర బరువు మరియు మూత్రంలో రక్తంలాంటివి, ఆటల్లో అలసట , ఎక్కువగా హుషారుగా ఉండకపోవడం సంభవిస్తే ఇది మూత్రపిండ సమస్యల ప్రారంభ సంకేతాలు అని గుర్తించాలి.
టాయిలెట్ల శుభ్రత
పబ్లిక్ టాయిలెట్లు ఎల్లప్పుడూ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు (Urinary tract infection)కారణం కానవసరం లేదు. నిర్లక్ష్యం చేసి, చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇన్ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో ఎముకలను బలహీనపరుస్తుంది. ఈ విషయం చాలా మంది విషయంలో లేటుగా గుర్తించడం వల్ల ప్రోగ్రెసివ్ కిడ్నీ ఫెయిల్యూర్(Progressive kidney failure) ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.కమ్యూనిటీ టాయిలెట్లను ఉపయోగిస్తున్నప్పుడు చాలా శుభ్రత పాటించాలి. ఈ విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే .. ఇక్కడి నుంచే మూత్ర సంభందిత వ్యాధులు సంక్రమిస్తాయి.కిడ్నీ సమస్యలకు గురయ్యే తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , గర్భధారణకు ముందు టాక్సిన్స్‌కు గురికాకుండా ఉండటం ద్వారా వారి పిల్లలలో దాని తీవ్రతను నివారించడంలోనూ, తగ్గించడంలో సహాయపడవచ్చు,మూత్రపిండ సమస్యలను ముందుగా గుర్తించడం వలన (Kidney failure) మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించవచ్చు.
ALSO READ:బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్..