/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Kidnapping-two-year-boy-shiva-in-Metpally-of-Jagityala-district.jpg)
Jagtial : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం రేపింది. దుబ్బాకవాడలో నివాసముంటున్న లక్ష్మి-రాజు కుమారుడు శివను గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై ఎత్తుకెళ్లారు. మంగళవారం సాయంత్రం శివ అక్కతో కలిసి కిరాణా షాపుకు వెళ్తుండగా కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాలనీలో సీసీ ఫుటేజీలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడి అక్కతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.
Also Read : మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య!