Heroine : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఖుష్బూ కూతురు!

తెలుగు,తమిళ తెరపై ఖుష్బూ సినీ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇప్పటికీ తమిళ సినీ ప్రజల మనసులో ఆవిడ పేరు మారుమోగుతూనే ఉంటుంది.అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఆమె ఓ ఆసక్తి కర విషయాన్ని వెల్లడించింది.అదేంటంటే!

New Update
Heroine : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఖుష్బూ కూతురు!

Khushbu Daughter : ఖుష్బూ(Khushbu) .. తెలుగు తెరపై నిన్నటితరం అందాల కథానాయిక. ఆ తరువాత ఆమె తమిళ సినిమా(Tamil Cinema) లతోనే బిజీ అయ్యారు. తన గ్లామర్ తో అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. అలాగే సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. అలా ఆమె బ్యానర్లో నిర్మితమైన 'బాక్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కూతుళ్లను గురించి ప్రస్తావించారు. ఖుష్బూ - సుందర్ దంపతులకు అవంతిక - అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవంతిక లండన్(London) లో తన చదువు పూర్తిచేసుకుని వచ్చింది. సోషల్ మీడియా(Social Media) లో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందువలన ఖుష్బూ కూతురు అవంతిక .. యూత్ కి ముఖ పరిచయం ఉంది.
అవంతిక(Avantika) గురించి ఖుష్బూ ప్రస్తావిస్తూ .. "లండన్ లో తాను యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసుకుని వచ్చింది. ప్రస్తుతం డాన్స్ నేర్చుకుంటోంది. త్వరలోనే తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సొంత బ్యానర్ ద్వారా పరిచయం చేసే ఆలోచన లేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను .. అనుభవాలను ఫేస్ చేస్తూ వెళితేనే బాగుంటుంది. సపోర్ట్ చేయడానికి .. పడిపోతుంటే పట్టుకోవడానికి మేము ఉంటాము. కానీ తన ప్రయాణానికి అవసరమైన పాఠాలను తాను నేర్చుకుంటేనే బాగుంటుంది" అని చెప్పారు.

Also Read : అమిత్‌ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే..

#tollywood-actress #khushboo-actress-avanthika #telugu-industry
Advertisment
తాజా కథనాలు