భార్య స్వప్న మరణం తెలుసుకున్న భర్త సాయికుమార్ మనస్ధాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు హుటాహుటిన సాయికుమార్ ను మణుగూరు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మణుగూరు నుంచి భద్రాచలం అక్కడి నుండి ఖమ్మంకు తరలించారు. ప్రస్తుతం ఖమ్మంలోని మమతా ఆసుపత్రిలో సాయికుమార్ చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాన్నితన ఎడమచేతిపై రాసుకున్నాడు సాయికుమార్!. నా చావుకి కారణం డాక్టర్ మౌనిక అని రాసుకున్నాడు.
సాయికుమార్ ఆత్మహత్య ఘటన విషయంలో అసలు విషయం బయటకు రాకుండా కొందరు కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా సాయికుమార్ ఆత్మహత్యకు కారణం ఎడమచేతిపై రాసి ఉన్న పేరును చెరిపేసినట్లు తెలుస్తోంది. స్వప్న బలవన్మరణం, సాయికుమార్ ఆత్మహత్యాయత్నం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇందులో ఓప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
8 నెలల కిందట పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్న సాయికుమార్ , స్వప్నల జీవితాలు ఇలా కావడంతో కుటుంబసభ్యలు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. అసలు 7 నెలల గర్భవతి స్వప్న ఎందుకు సూసైడ్ చేసుకుంది? స్వప్న మరణం తెలుసుకుని పురుగుల మందు తాగిన భర్త సాయికుమార్ నా చావుకి కారణం డాక్టర్ మౌనిక అని ఎందుకు రాసుకున్నాడు? సాయికుమార్ రాసిన పేరును చెరిపేసింది ఎవరు? అసలు ఎవరీ డాక్టర్ మౌనిక? సాయి కుమార్‌తో సంబంధం ఏంటి? ఓ ప్రజాప్రతినిధి ఈ కేసులో ఎందుకు జోక్యం చేసుకుని కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: “దేవుడా నన్ను రక్షించు”…లిఫ్ట్‌లో ఇరుక్కొని..20 నిమిషాలు చిన్నారి నరకయాతన..!!