కేసీఆర్, కేటీఆర్ మాటలు పట్టించుకోవద్దు: రేణుకా చౌదరి రాహుల్ ఖమ్మం పర్యటన తరువాత అదిరిపోయి బెదిరి పొయ్యారు, మీటింగ్ రాకుండా వాహనాలను అడ్డుకున్నారనిమాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు ధన్యవాదాలు, వాహనాలను అడ్డుకొని కార్యకర్తలను కదిలించారు. రాష్ట్ర పరిస్థితి చూసీ భయపడి బండి సంజయ్‌ను మార్చారని అన్నారు. త్వరలోనే బీజేపీ, బీఆర్ఎస్‌లకు షాక్ ఇస్తాం అని అన్నారు. తెలంగాణలో పోటీలో ఉండేది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అని రేణుక చౌదరి అన్నారు. By Vijaya Nimma 09 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం వెయింటిగ్ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని రేణుక తెలిపారు. భవిష్యత్తు బాగుంటుందని సెటైర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీష్‌రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎద్దేవా చేశారు. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని చెప్పారు. బీజేపీ ఉత్తరాదిన వంద సీట్లకుపైగా కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు. పార్లమెంట్‌లో అసభ్యంగా, అసహ్యంగా ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు. సీఎం, ప్రధాని ఒక్కటే..! రాష్ట్రంలో కారు పార్టీ నాలుగు టైర్స్ గాలి పోయిందని.. జిల్లాలో గనులు అమ్ముతూన్న బీఆర్ఎస్ నేతలు చెసే కుట్ర బయట పెడతామని రేణుక చౌదరి వ్యాఖ్యనించారు. సింగరేణి బ్లాస్టింగ్‌కి నెర్రెలు వస్తున్నాయి అయిన వారిని పట్టించుకోటం లేదని మండిపడ్డారు. 1/70 పై రాహుల్ ఇచ్చిన హామీ అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా 4 వేల పెన్షన్ పథకం ఆకర్షణగా ఉందన్నారు. 4 నెలలో ఎన్నికలు రావొచ్చు నార్త్ లో 80 సీట్లు వరకు బీజేపీ ఓడి పోవటం కాయం అన్నారు. సిద్ధాంతాలు పక్కన పెట్టి ఈడీలను ప్రయోగించారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి