BREAKING: ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు

TG: ఖమ్మం జిల్లాలో ఐదురోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ఆ జిల్లా కలెక్టర్. తిరిగి సోమవారం విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!
New Update

School Holiday: ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యాసంస్థలకు తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న అనునుకూల పరిస్థితులను దృష్టియందుంచుకొని ఈ నెల 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు ఆ జిల్లా కలెక్టర్. తిరిగి సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవును ఖఛ్చిత్తంగా పాటిస్తూ సదరు సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. మండల విద్యాధికారులు తమపరిధిలోని అన్నియాజమాన్య పాఠశాలలు విధిగా పాటించునట్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డేంజర్ లో భద్రాచలం..

భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తోంది. మూడో ప్రమాద హెచ్చరికల చేరువలో గోదావరి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ పేర్కొన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Also Read : వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్

#school-holiday #telangana-floods #khammam-floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe