TS DSC 2024: ఈ బుక్స్ చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. లిస్ట్ ఇదే!

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బోధన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఉద్యోగం సాధించడంలో టెక్ట్స్ బుక్స్, కోచింగ్ సెంటర్ల మెటీరియల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ చదివే విధానంలో ఈ ట్రిక్స్ తప్పనిసరి ఫాలో కావాలంటున్నారు. హెడ్డింగ్ క్లిక్ చేయండి.

TS DSC 2024: ఈ బుక్స్ చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. లిస్ట్ ఇదే!
New Update

Best Books For TS DSC 2024: ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రముఖ బోధన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఉద్యోగం సాధించడంలో టెక్ట్స్ బుక్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ వాటిని చదివే విధానంలో ట్రిక్స్ తప్పనిసరి తెలుసుకోవాలంటున్నారు. పరీక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టెక్ట్స్ బుక్స్ తోపాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలచేత తయారు చేయించి.. పలు ఇనిస్టిట్యూట్ లు అందిస్తున్న మెటీరియల్ కూడా ప్రమాణికమేనని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు వెలువడగా కొన్ని మాత్రమే నిరుద్యోగులను ప్రయోజకులను చేయడంలో సక్సెస్ అవుతున్నాయని, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు సాధించడంలో బాసర ఇనిస్టిట్యూట్ (Basara Institute) ముందుందని బాసర డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ చెబుతున్నారు.

ఎస్ జీటీ అభ్యర్థులు..

ఈ మేరకు ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం ప్రిపరేషన్ లో టెక్ట్స్ బుక్స్ ప్రధానపాత్ర పోషిస్తాయంటున్నారు. ఎస్ జీటీ (టీచర్) ఉద్యోగాల కోసం మాత్రం స్కూల్ స్థాయి పుస్తకాలు తప్పనిసరి చదవాలి. 5వ తరగతి నుంచి 10 వరకూ స్కూల్ టెక్ట్స్ బుక్స్ (Text Books) మొత్తం ప్రతి సబ్జెక్ట్ మరోసారి తిరగేయాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్, మెథడ్స్, పీఐఈ, సబ్జెక్ట్ లపై దృష్టి పెట్టాలి. వీటిపై ఎంత శ్రద్ధ వహిస్తే అంత సులభంగా ఎస్ జీటీ ఉద్యోగం సాధించవచ్చు. అదే విధంగా సైన్స్, సోషల్, జీకే, సీ, ఏ, తెలుగు సబ్జెక్ట్ లను ఒక ప్రణాళిక బద్ధంగా చదివితేనే మంచి స్కోర్ సాధించవచ్చు. వీటితోపాటు పలు ఇనిస్టిట్యూట్ లో బోధిస్తున్న నిపుణుల సలహాలు, సూచనలు, క్లాసులతోపాటు నోట్స్ తప్పనిసరి తీసుకోవాలి. ఉద్యోగం సాధించడంలో ఫ్యాకల్టీ రన్నింగ్ నోట్స్ చాలా కీలకంగా మారుతాయి. ఎందుకంటే ఇటీవల గురుకుల పరీక్షల్లో టెక్ట్స్ బుక్ లో ఉన్న దానికంటే 70 శాతం సిలబస్ బయటనుంచి అడిగారని, కోచింగ్ సెంటర్లు దానికి అనుగుణంగా మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.

This browser does not support the video element.

ఇది కూడా చదవండి: AP DSC 2024: డిఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్ లో మార్పులు..!

స్కూల్ అసిస్టెంట్..

ఇక స్కూల్ అసిస్టెంట్ (School Assistant) కొలువుల కోసం కసరత్తులు చేస్తున్న అభ్యర్థులంతా ఎంసెట్ స్థాయిలో ప్రిపేర్ అయితే చాలని సూచిస్తున్నారు. ఈ ఉద్యోగంలో మెథడాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పరీక్షలోనూ 6 నుంచి ఇంటర్ వరకూ ప్రశ్నలు అడుగుతారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలజీ సైన్స్ లాంటివి ఎంసెట్ స్థాయిలో ప్రపేర్ కావాలి. ఇంటర్ నుంచి కూడా కఠిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉటుందని చెబుతున్నారు. స్కూల్ టెక్ట్స్ బుక్స్ లో ప్రతి లెస్సన్, ప్రతి అక్షరం చదవాలని, అలా అయితేనే ఎక్కువ మార్కులు సాధించగలమంటున్నారు. ఇంటర్ పుస్తకాల్లోనూ టాపిక్స్ ఒకటికి రెండుసార్లు చదవాలి. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యావాళ్లు కూడా సబ్జెక్ట్ ఆధారంగా ఇంటర్, స్కూల్ టాపిక్స్ తప్పనిసరి చదవాలి. మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. టీజీడీ, పీజీటీ, ఉద్యోగాలకు టెక్ట్స్ బుక్స్ చాలా ప్రమాణికమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రామాణికమైన కోచింగ్ సెంటర్ బుక్స్ తప్పనిసరి.

నిర్ణయంలోనే 50శాతం ఫలితం..

అలాగే ప్రతి అభ్యర్థి తాను సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. చదివిన ప్రతి అంశాన్ని నోట్స్ రూపంలో రికార్డు చేసుకున్నపుడే సక్సెస్ అవుతారు. నోట్స్ లేకపోతే చదివింది ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం లేకపోగా కొన్నిసార్లు ఒత్తిడిలోనూ అయోమయంలో పడే అవకాశం ఉంటుందని, అందుకే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సులభంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగం సాధించిన 90 శాతం మంది సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నట్లు తెలిపారు. అది లేకపోతే ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. మంచి సంస్థ మెటిరియల్ తప్పనిసరి ఫాలో కావాలి. మంచి ఫ్యాకల్టీని గుర్తించి వారి బుక్స్ ఫాలో కావాలి. ఏదిపడితే అది చదివితే నష్టపోతారు. మన నిర్ణయంలోనే 50శాతం గెలుపు, ఓటమి ఆధారపడి ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇక గురుకుల ఉద్యోగాలు సాధించిన వారిలో బాసర పిల్లలే అధిక శాతం ఉన్నారని చెబుతున్నారు. సబ్జెక్ట్ లేనివారంతా తమ ఇనిస్టిట్యూట్ కు వచ్చి ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రయోగాలు చేసే సమయం లేదు. అందరూ ఇప్పటినుంచి సీరియస్ గా ప్రిపేర్ కవాలని సూచిస్తున్నారు. ఏళ్లపాటు చదివితేనే ఉద్యోగాలు సాధించగలం. అంతేకానీ రాత్రికి రాత్రికి హీరోలు అయిపోరంటూ కనువిప్పు కలిగిస్తున్నారు డైరెక్టర్ శ్రీనివాస్.

#government-jobs #key-tips #teaching-experts
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe