కాంగ్రెస్‌లో పొంగులేటికి కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన మల్లిఖార్జున ఖర్గే

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా టీపీసీసీ ప్రచార కమిటీని ప్రకటించింది. ఇందులో పొంగులేటికి కీలక బాధ్యతలు అప్పగించింది టీకాంగ్రెస్‌.

New Update
కాంగ్రెస్‌లో పొంగులేటికి కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన మల్లిఖార్జున ఖర్గే

Key responsibilities for Ponguleti in Congress..Mallikarjuna Kharge issued orders

కీలక నిర్ణయం
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. ఈసారి ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. అయితే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కాగా, నిన్న చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కో-చైర్మన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు. అథారిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని నియమించింది.

నోటిఫికేషన్ విడుదల

దీంతో పాటు 37 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ పదాధికారులు, వివిధ శాఖల పార్టీ, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేకంగా నియమించారు. ఏఐసీసీ కూడా ఆహ్వానితులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఏఐసీసీ పరిశీలకులను ప్రధాన కార్యాలయం నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆమోదం తెలిపారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. వీరి నియామకం వెంటనే అమల్లోకి వస్తుంది.

ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలకు బాధ్యతలు

ఇదిలా ఉంటే.. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఏఐసీసీ పరిశీలకులను అధిష్ఠానం నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం కూడా తెలిపినట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. వీళ్ల నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పర్యవేక్షకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు ఈ బాధ్యతలను ఇచ్చింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. ఇక పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, కౌన్సిల్‌ నేత, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రచార కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు