IAS PV Ramesh: స్కిల్ డెవలప్‍మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ కీలక వ్యాఖ్యలు స్కిల్ డెవలప్‌మెంట్‌లో తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమన్నారు మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వంలో గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నపీవీ రమేశ్ అన్నారు. విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయి..? అని మాజీ ఐఏఎస్ పీవి రమేశ్ ప్రశ్నించారు. By Vijaya Nimma 11 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి IAS PV Ramesh Comments on Skill Development Case: తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాలి స్కిల్ డెవలప్‌మెంట్‌లో తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమన్నారు మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వంలో గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నపీవీ రమేశ్ అన్నారు. విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయి..?..స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫైల్స్ స్పష్టంగా చూడాలి..!! తప్పు చేసిన అధికారులను వదిలి మాజీ సీఎంను ఎలా అరెస్ట్ చేస్తారు..? ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం, వారి పేర్లు ఏవి..? అని మాజీ ఐఏఎస్ పీవి రమేశ్ ప్రశ్నించారు. ఎండీ, కార్యదర్శి బాధ్యత వహించాలి స్కిల్ డెవలప్‍మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఆర్థిక శాఖ ఏ తప్పూ చేయలేదన్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ చేయడంపై తాజాగా మాజీ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ స్పందించారు. తన స్టేట్‌మెంట్‌తోనే చంద్రబాబును అరెస్టు చేశారనడంపై దిగ్భ్రాంతికరమన్నారు పీవీ రమేశ్. స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ, కార్యదర్శి నిధుల వినియోగంలో అక్రమాలు జరిగితే ప్రధానంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. Also Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి? ఎలా తెలుస్తుంది..? సీఐడీ అధికారులు పెట్టిన కేసులో ఎండీ, కార్యదర్శిల పేర్లు లేవని పీవీ రమేష్ గుర్తు చేశారు. అంతేకాకుండా అధికారుల చేసిన తప్పులను నాయకులకు ఆపాదించడమేంటని ఆయన గుర్త చేశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతీ రోజు వందలకు పైగా అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో ఏ బ్యాంకు ఎకౌంట్‌లో ఏం జరుగుతోందో ఎలా తెలుస్తుందని..? అని ప్రశ్నిచారు. ఫైల్స్ పరిశీలించాలి స్కిల్ డెవలప్‍మెంట్ విషయంలో ఫైల్స్, అప్పట్లో తీసుకున్న విధాన నిర్ణయాల వివరాలు ఎక్కడున్నాయ్..? అని పీవీ రమేశ్ ప్రశ్నించారు. వాటి అన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే నిధుల వినియోగం వివరాలు పూర్తిగా తెలుస్తాయని ఆయన అన్నారు. సీఐడీ (CID) పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. గతంలో కూడా ఈ కేసు విచారణలో సీఐబీకి పీవీ రమేష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారనని గుర్తు చేశారు. దానిని ఇప్పుడు సీఐడీ అధికారులు ఈ స్టేట్‌మెంట్‌కు అనుకూలంగా మార్చుకుందని పీవీ రమేష్ తాజాగా ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫైల్స్ చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు. సీఎం అధికారుల మీద ఒత్తిడితెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం జరగదు అన్నారు. . స్కిల్ డెవలప్‌మెంట్‌పై రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులను పక్కన పెట్టి..మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి? అని పీవీ రమేశ్ ఆగ్రహ వ్యక్తం చేశారు. Also Read: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్ #key-comments #ias-pv-ramesh #case-of-skill-development #ias-pv-ramesh-comments-on-skill-development-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి