/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dsc-jpg.webp)
TS DSC 2024 Key Changes: తెలంగాణలో ఇటీవల విడులచేసిన మెగా డీఎస్సీని పకడ్బందిగా నిర్వహించేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కసరత్తులు చేస్తోంది. మార్చి 4 నుంచి అప్లికేషన్స్ ప్రక్రియ మొదలవగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన అన్ని పనులను వేంగంగా పూర్తి చేస్తున్నారు అధికారులు. మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన జరిగింది. అలాగే డీఎస్సీ పరీక్ష విధానం (Scheme Of Examination), సిలబస్, రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే పూర్తి కాగా ఈసారి ప్రశ్నల సరళిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు.
అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే..
ఈ మేరకు పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. కేంద్రీకృత వ్యవస్థతోనే డీఎస్సీ ఉంటుందని తెలిపారు. డీఎస్సీ సిలబస్‌పై (TS DSC Syllabus) అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. కాగా సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరగనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : CM Revanth Reddy : ప్రధాని అంటే పెద్దన్న.. మోదీ మనసు దోచుకున్న తెలంగాణ సీఎం
అవసరమైన కీలక పాస్‌వర్డ్స్..
అలాగే ప్రశ్నపత్రం ఎక్కడా లీక్ కాకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్ట పరుస్తున్నట్లు చెప్పారు. అవసరమైన కీలక పాస్‌వర్డ్స్ అన్నీ రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించామని, ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఎలాంటి ఫిర్యాదులు లేని వ్యక్తులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తామని, ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు. వారికి జిల్లా అధికారులు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.