Aadhaar: అలర్ట్...ఆధార్ లో కీలక మార్పులు...ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవల్సిందే..!!

దేశంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మంది ఉన్నారని అంచనా. 18ఏళ్లు నిండినా ఆధార్ కార్డు పొందనివారు ఎక్కువగానే ఉన్నారు. అలాంటివారు ఇప్పుడు ఆధార్ కార్డును పొందటం అంత సులభం కాదు. కొత్తగా ఆధార్ తీసుకునే వారికి మల్టి లెవెల్ వెరిఫికేషన్ UIDAI తప్పనిసరి చేసింది.

Aadhaar: అలర్ట్...ఆధార్ లో కీలక మార్పులు...ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవల్సిందే..!!
New Update

ఆధార్ కార్డు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కూడా ఒకటి. ఆధార్ కార్డు లేనిది ఎలాంటి పనులు చేయలేము. ముఖ్యంగా రేషన్ కార్డు దగ్గరి నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించే వరకు చాలా వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. అందుకే ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ గా పేర్కొంటున్నరాు. అయితే 18ఏళ్లు నిండినా ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మందే ఉన్నారని అంచనా. అయితే 18ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్త ఆధార్ కార్డు తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఆధార్ కార్డుల జారీపై యూఐడీఏఐ కొత్త నిబంధన పెట్టింది. కొత్తగా ఆధార్ తీసుకునేవారికి మల్టిలెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. పాస్ పోర్టు వెరిఫికేషన్ తరహా వ్యవస్థను రెడీ చేసింది.

యూఐడీఏఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ దరఖాస్తు చేసిన వ్యక్తి ఇంటికి అధికారులు వచ్చి మీ ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునమాను వెరిఫై చేస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం జిల్లా, సబ్ డివిజినల్ స్థాయిల్లో నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను నియమిస్తారు. పాస్ పోర్టు తరహాలోనే చాలా కఠినంగా అడ్రస్ వెరిఫికేషన్ చేసిన సదరు వ్యక్తి కొత్త ఆధార్ కార్డుపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆధార్ అప్లయ్ చేసింది మొదలు ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు దాదాపు 180రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త నిబంధనలను 18ఏళ్లకు పైబడి మొదటిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమేనని యూఐడీఏఐ వెల్లడించింది. దేశ భద్రతను పరిగణలోనికి తీసుకుని ఫేక్ పర్సన్స్ కు ఆధార్ కార్డు ఇవ్వకుండా నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఆధార్ అప్ డేట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ కార్డు పొంది 10ఏళ్లు దాటినవారు మళ్లీ అప్ డేట్ చేసుకోవాలి. అయితే ఈ ఆధార్ అప్ డేట్ తేదీ గడువు మార్చి 24వ తేదీ 2024 వరకు ఉంది.

ఇది కూడా చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్…కానీ అమ్మకాల్లో నెంబర్ 1..టాటా, హ్యుందాయ్ కి షాక్..!!

#new-aadhaar-cards #aadhaar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి