Konda Surekha: వారికి రూ.10 లక్షలు.. మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన

రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేస్తూ మంచి వార్త చెప్పారు. వన్యప్రాణులు దాడి చేయడం వల్ల మరణించేవారి కుటుంబాలకు రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచారు. ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. దీనిపై త్వరలోనే జీవో రిలీజ్ కానుంది.

New Update
Konda Surekha: వారికి రూ.10 లక్షలు.. మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన

Minister Konda Surekha: తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) ఒకరి తర్వాత ఒకరు బాధ్యతలు తీసుకుంటూన్నారు. తొలి ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి (Forest Minister) కొండా సురేఖ కూడా తొలిసంతకం చేశారు. సంతకం చేస్తూనే ఓ మంచి వార్త చెప్పారు. వన్యప్రాణులు దాడి చేయడం వల్ల చనిపోయేవారి కుటుంబాలకు ఇప్పటివరకు రూ. 5లక్షల పరిహారం ఇస్తుంటే ..ఇక నుంచి దాన్ని రూ. 10లక్షల వరకు పెంచారు. దీని వల్ల దాడిలో మరణించేవారికి ఎలాంటి లాభం ఉండదు కానీ..వారి కుటుంబసభ్యులకు ఆర్థికంగా కొంత వెన్నుదన్నుగా నిలిచినట్లు అవుతుంది. ఈ రూల్ రూ. 10లక్షల రూల్ ఇంకా అమల్లోకి రానప్పటికీ..త్వరలోనే జీవో రిలీజ్ కానుంది. అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు దాడి చేస్తే..చనిపోతే కుటుంబ సభ్యులకు మాత్రం పరిహారంగా రూ. 5లక్షలే వస్తాయి.

ఇది కూడా చదవండి:  ఆ సీటు నుంచి ఎంపీగా సోనియా పోటీ.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన తీర్మానం!

కాగా కొండాసురేఖ..రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు సెక్రేటరియట్ లోని 4వ అంతస్థులో ఆఫీస్ ఉంది. అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. రెండో సంతకాన్ని ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెలంగాణకు తెచ్చుకునేందుకు అనుమతి ఇఛ్చే ఫైల్ పై సంతకం పెట్టారు.

ఇప్పుడు అటవీశాఖ మంత్రి కాబట్టి..ఆ శాఖకు సంబంధించిన అంశమైన అడవుల పెంపు, హరితహారం, పచ్చదనం, కంపాపథకం కింద చేపట్టిన పనులపై కూడా అధికారులతో చర్చించారు. అందరం కలిసి రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచే దిశగా ప్రయత్నాలు చేద్దామంటూ అధికారులకు సూచించారు. తెలంగాణలో చిరుతపులులు దాడి చేసి చంపుతున్న ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. అలాగే పొలాల్లో పనిచేసుకుంటున్నవారిపై చిరుతలు, ఎలుగుబంట్లు దాడి చేస్తుండం ఇలాంటి చర్యలను అడ్డుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి అంశాలపై మంత్రి కొండా సురేఖ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులూ బీఅలర్ట్…ఈ వారం అప్లయ్ చేసుకోవల్సిన జాబ్స్ ఇవే..!!

Advertisment
తాజా కథనాలు