అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభమైన దర్శనాలు..పోటెత్తిన మాలధారులు!

ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల శుక్రవారం తెల్లవారుజామున తెరుచుకుంది. స్వామి సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులతో నిండిపోయింది.

New Update
అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభమైన దర్శనాలు..పోటెత్తిన మాలధారులు!

ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల ఆలయం తెరుచుకుంది. మండల పూజలు మకర విళక్కు పూజల కోసం ఆలయాన్ని అధికారులు తెరిచారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకే గుడి తలుపులను తెరిచిన ప్రధాన పూజారి మహేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయం లోపల సంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత భక్తులను దర్శనం కోసం అనుమతించారు. స్వామి వారి దర్శనం కోసం కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. మండల పూజల కోసం శబరిమల ఆలయం గురువారం సాయంత్రం తెరుచుకోగా..శుక్రవారం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి.

ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు నూతన అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌, కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే. రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యేలు ప్రమోద్‌ నారాయణ్‌, కేయూ జెనిశ్‌ కుమార్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. జనవరి వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి. మలయాళ మాసం వృశ్చికం మొదటి రోజున అయ్యప్ప సన్నిధానంలో మండల పూజలు మొదలవుతాయి. ఇవి మకర జ్యోతి వరకూ కొనసాగుతాయి.

మకరవిళక్కు తరువాత ఆలయాన్ని మూసివేస్తారు. కేవలం నెలవారీ పూజల కోసం మూడు రోజుల పాటు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. స్వామి వారి సన్నిధానం శుక్రవారం ఉదయానికే అయ్యప్ప స్వాములతో పంబా తీరం నిండిపోయింది. పంబా నుంచి సన్నిధానం వరకూ భారీగా క్యూ లైన్‌ లో భక్తులు వేచి ఉన్నారు

Also read: హాలీవుడ్‌ పిలుస్తుందంటున్న జగ్గూ భాయ్‌!

Advertisment
తాజా కథనాలు