Kerala: నిపా వైరస్ మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సదరు బాలుడికి నిపా వైరస్ సోకినట్లుగా నిర్ధారించిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు.
ప్రస్తుతం బాలుడు ప్రైవేటు ఆసుప్రతిలో వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాలుడిని త్వరలోనే కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం బాలుడి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హై రిస్క్ కాంటాక్టులను విభజించి.. నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ముందుజాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.