Nipah Virus: నిఫా వైరస్ ఎఫెక్ట్..7 గ్రామాలను కంటైన్ మెంట్ జోన్‌ గా ప్రకటించిన ప్రభుత్వం!

నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

New Update
Nipah Virus: నిఫా వైరస్ ఎఫెక్ట్..7 గ్రామాలను కంటైన్ మెంట్ జోన్‌ గా ప్రకటించిన ప్రభుత్వం!

Kerala Nipah Virus: కరోనా (covid) తరువాత ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న వైరస్‌ నిఫా(Nipah). ఇప్పటికే ఇది కేరళలో ఇద్దరిని బలి తీసుకుంది. చనిపోయిన వారి బంధువులను కూడా వైద్యాధికారులు అబ్జర్వేషన్‌ లో ఉంచి పరిశీలిస్తున్నారు. నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) బృందాలు కేరళలోని కోజికోడ్‌ కు ఇప్పటికే చేరుకున్నాయి. కరోనా సమయంలో ఏర్పాటు చేసినట్లుగానే మొబైల్ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసి నిఫా పరీక్షలు, గబ్బిలాల సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేరళ అసెంబ్లీకి బుధవారం తెలిపింది.

ఇప్పటికే నిఫా వైరస్‌ రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోయింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కేరళలో వ్యాపిస్తుంది బంగ్లాదేశ్ (Bangladesh) వేరియంట్ అని వ్యైద్యులు తెలిపారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని అధికారులు తెలిపారు. వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ..కూడా మరణాల రేటు మాత్రం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు.

నిఫా రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీలను అందించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) అంగీకరించిందని ఆమె తెలియజేశారు. ఈ క్రమంలోనే కోజికోడ్‌ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు..అటాన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించింది.

విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకూడదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పినరయి తెలిపారు.

Also Read: ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్…అసలు విషయం తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు