Sunita Kejriwal: కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కాషాయ పాలకుల కుట్ర..! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను తీహార్ జైల్లో అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. By Bhoomi 21 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sunita Kejriwal: బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్. తీహార్ జైల్లో ఉన్న తన భర్తను అంతమొందించేందుకు బీజేపీ ప్లాన్ రచిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ తీసుకునే భోజనాన్ని కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్నిపసిగట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని..కేజ్రీవాల్ కదలికలను అధికారులు పసిగడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆప్ చీఫ్ తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించడం సిగ్గుచేటుకు నిదర్శనమన్నారు. డయాబెటిస్ తో బాధపడుతూ 12ఏళ్ల నుంచి ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించిన సునీతాకేజ్రీవాల్..కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ను నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని చంపేయాలని బీజేపీ కోరుకుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాంచీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లు తప్పు చేశారని నిజం రుజువు కాకముందే వారిని జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. తన భర్త చేసిన తప్పేంటని ఆమె నిలదీశారు. మెరుగైన విద్యా, వైద్య సౌకర్యాలు సమకూర్చడమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ తన జీవితాన్ని పణంగా పెట్టారంటూ..ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన కేజ్రీవాల్ తలుచుకుంటే విదేవాలకు వెళ్లవచ్చని..కానీ ఆయన దేశభక్తికే మొగ్గుచూపారని సునీతా కేజ్రీవాల్ చెప్పారు. ఇది కూడా చదవండి: డీడీ లోగోకు కాషాయం రంగు..ఇది ఆరంభం మాత్రమే..మోదీ అసలు ప్లాన్ తెలుస్తే..! #national-news #loksabha-elections-2024 #delhi #sunita-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి