Raghu Thatha Movie : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 13 నుంచి తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Raghu Thatha Movie : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
New Update

Raghu Thatha Movie : గత ఏడాది 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘుతాత'. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.



Also Read : ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు

సెప్టెంబరు 13న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక కొత్త పోస్టర్‌ను పంచుకుంది. 1960ల కాలం నాటి నేపథ్యంలో మూవీని రూపొందించారు. హిందీ వ్యతిరేక ఉద్యమం, రాజకీయ అంశం చుట్టూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్.

#keerthi-suresh #raghu-thatha-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe