వేసవిలో కీర దోసతో కలిగే ప్రయోజనాలు..

రోజు రోజుకి భానుడి వేడి పెరిగిపోతుంది.ప్రజలు ఎండవేడిమి తట్టుకోలేక బయట దొరికే కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు.అయితే వేసవిలో కీర దోస తినటం వల్ల ఎండ వేడిమి నుంచి తప్పించుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

వేసవిలో కీర దోసతో కలిగే ప్రయోజనాలు..
New Update

మండే ఎండల్లో శరీరానికి చలువనిచ్చేది కీరా దోసకాయ.నిజానికి ఇది అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. కానీ ఎక్కువమంది వేసవికాలంలోనే తింటూ ఉంటారు.ఇందులో 90శాతం పైన నీటి కంటెంట్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందంగా కనిపించేలా చేస్తుంది.

దీన్ని కొంతమంది తొక్కతోపాటు తింటే మరికొందరు తొక్క తీసేసి తింటారు. ఎలా తిన్నా ఆరోగ్యమే. ఎందుకంటే ఈ తొక్కలో విటమిన్ కే, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు అధికంగా ఉంటాయి. విటమిన్ కే కూడా లభిస్తుంది. కొంతమేరకు ప్రోటీన్ కూడా ఉంటుంది. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, దోసకాయలు చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

ఈ రాడికల్స్ క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. దోసకాయను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కీరాదోస చాలా మంచి ఎంపిక. క్యాలరీలు, పిండి పదార్థాలు కూడా తక్కువే.డయాబెటిస్ ఉన్నవారికి కూడా దోసకాయ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో చక్కర చాలా తక్కువ అలాగే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. అంటే ఇది తిన్నాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువ పరిణామంలో పెరుగుతాయి.

మధుమేహం ముదరకూడదు అనుకుంటే దోసకాయను తినడం అలవాటు చేసుకోవచ్చు. దోసకాయ తీసుకోవడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి . మలబద్ధకాన్ని నివారిస్తుంది. దోసకాయలో నీరు . ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . దోసకాయల్లో ఉండే ఒక ప్రత్యేకమైన రసాయనం క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రోజుకి ఒక దోసకాయ తినే వారిలో కాలేయం, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఒక అధ్యయనం చెబుతోంది.

#keera-dosa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe