Health Tips: వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచితే ఈ రోగాలు తప్పవు

ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచినా పాడైపోయినా, దుర్వాసన రాదు. అలాంటి ఫుడ్‌ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఏ పదార్థాలు ఎన్నిరోజులు పెట్టాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Health Tips: వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచితే ఈ రోగాలు తప్పవు

Health Tips: వేసవిలో ఆహారా పదార్ధాల విషయంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ సేపు నిల్వ ఉండు. అయితే కొందరైతే.. ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తింటారు. ఇలా చేయడం వలన అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబున్నారు. చాలా సార్లు, వండిన ఆహారం చెడిపోయినా కానీ దుర్వాసన రాదు. అయితే ఇలా తింటే ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం ఎంతకాలం భద్రంగా ఉంటుంటు..? వండిన ఆహారాన్ని ఇంతకంటే ఎక్కువ సేపు రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుంటే ఎలాంటి రోగాలు వస్తాయో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదని ఆహార పదార్ధాలు:

  • వేసవి కాలంలో ఆహారం త్వరగా పాడైపోతుందన్న విషయం అందరికి తెలిసిందే. అందుకని చాలామంది ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఇలా వండిన ఆహారాన్ని ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి..? ఎంత సమయం తర్వాత పాడవుతుందో కొందరికి తెలియదు. అయితే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆహారం త్వరగా పాడైపోతుందని.. అందుకే రిఫ్రిజిరేటర్‌లోదాచి పెడతారు. అయితే ఇలా ఎక్కువసేపు ఉంచిన తర్వాత కూడా ఆహారం హానికరంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల.. ఆహారాన్ని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచకుండా ఉండటమే బెటర్ అంటున్నారు.
  • నిజానికి కొందరి ఫ్రిడ్జ్ సరిగా శుభ్రం చేయరు. దీనివల్ల అందులో క్రిములు పెరగడం వల్ల ఫ్రీజర్‌లో ఉంచిన ఆహారం మీద కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది. అలాంటప్పుడు ఆ ఆహారం తిన్నప్పుడు కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రిజ్‌ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
  • రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో గాలికి ఖాళీ ఉండదు. దాని వల్ల అనేక రకాల బ్యాక్టీరియా తయారు అవుతుంది.
  • ప్రతి ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడానికి వేర్వేరు సమయం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయలను 3-4 రోజులు ఉంచవచ్చు. అదే సమయంలో.. పండ్లు ఒక వారం పాటు ఉంచవచ్చు. మాంసం, గుడ్లు, బీన్స్‌ను రెండు రోజుల్లో ఉపయోగించాలి. ఆహారాన్ని తినాలంటే.. దానిని 5-6 గంటల కంటే ఎక్కువ రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదని చెబుతున్నారు.
  • వంట చేసిన 1-2 గంటలలోపు ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఫ్రిజ్ యొక్క ఉష్ణోగ్రత 2-3 డిగ్రీల లోపల ఉండాలని కూడా గుర్తుంచుకోవాలి. ఉడికించిన కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే.. దానిని 3-4 గంటలు మాత్రమే ఉంచాలి. తినే ముందు దానిని వేడి చేసి తీసుకుంటే మంచిది.
  • ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచినా పాడైపోయినా, దుర్వాసన రాదు. అలాంటి ఫుడ్‌ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అలాంటి ఆహారాన్ని వాడకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వీడెవడ్రా బాబూ.. చిరుతతో సెల్ఫీ దిగాడు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు