Heart Attack: పిల్లిని పెంచుకుంటే గుండెపోటు రాదా? ఇంట్లో పిల్లిని పెంచుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిల్లులను పెంచుకునే వ్యక్తులు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారట. By Vijaya Nimma 31 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Heart Attack: పిల్లులను పెంచుకునే వ్యక్తులు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వీరికి ఇతర వ్యక్తులతో పోలిస్తే గుండె, బీపీ సమస్యలు తక్కువగా ఉంటాయి. పిల్లిని కలిగి ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. తత్ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. పెంపుడు జంతువును పట్టుకోవడం వల్ల రక్తంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల స్థాయిని తగ్గించవచ్చు. 30 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల 4,435 మంది పెద్దల నుంచి డేటాను విశ్లేషించిన తర్వాత నిపుణులు ఈ విషయం వెల్లడించారు. వీరిలో సగం మంది పిల్లిని కలిగి ఉన్నారు. వీరిలో గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా అన్ని కారణాల నుంచి ఉపశమనం ఉందని తెలిపారు. దీనిపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. ఇంట్లో పిల్లని పెంచుకుంటే ఎన్నో లాభాలు: పిల్లులను నివారించే వ్యక్తుల కంటే పిల్లి యజమానులు గుండెపోటుతో మరణించే రేటు తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ వల్ల గుండెపోటు ముప్పు 30 శాతం తగ్గుతుందని తెలిపారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, ధూమపానం, మధుమేహంతో సహా గుండె జబ్బులను ప్రేరేపించే అంశాలపై నిపుణులు తనిఖీ చేశారు. అయితే పిల్లి యజమానులకు స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని వారు కనుగొన్నారు. స్ట్రోక్ ఇన్‌స్టిట్యూట్‌లో 4,000 మందికిపైగా 10 సంవత్సరాల అధ్యయనం చేశారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. పిల్లులను పెంచుకునే వ్యక్తులు చాలా మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని, వారికి స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో స్పష్టంగా తెలిదంని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #heart-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి