Refrigerator Tips: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉపయోగిస్తున్నారు. అయితే, రిఫ్రిజిరేటర్ (Refrigerator)ని ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నా.. చాలా ముఖ్యమైన విషయాలు ప్రజలకు తెలియవు. అటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రిఫ్రిజిరేటర్‌ను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడం. ఎందుకంటే, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఫ్రిజ్‌ని వేర్వేరు ఉష్ణోగ్రత(temperature)ల్లో ఉంచాల్సి వస్తుంది. కానీ, కొన్నిసార్లు ప్రజలు ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా మరచిపోతారు.వాస్తవానికి, బయట వాతావరణంలో మార్పుతో, బయట ఉష్ణోగ్రత కూడా మారుతుంది. రిఫ్రిజిరేటర్ స్థిరమైన ఉష్ణోగ్రతను నిరంతరం నిర్వహిస్తుంది. దీని కారణంగా ఆహారం తాజాగా ఉంటుంది. కానీ, ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత కూడా సరిగ్గా సెట్ చేయబడటం చాలా ముఖ్యం. లేకపోతే, మీరు నిల్వ చేసిన పాలు పెరుగుగా మారవచ్చు లేదా లోపల ఉంచిన టమోటా గట్టిగా మారతుంది. అటువంటి పరిస్థితులను నివారించడానికి, రిఫ్రిజిరేటర్‌లో రెగ్యులేటర్(A regulator in a refrigerator) అందుబాటులో ఉంది.
లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న రిఫ్రిజిరేటర్‌లలో, వివిధ సీజన్‌లకు సంబంధించిన గుర్తులు ఇప్పటికే రెగ్యులేటర్‌లో ఉంటాయి. కానీ, మీ రిఫ్రిజిరేటర్‌లో అలాంటి మోడ్ లేదా మార్కింగ్(mode or marking) లేనట్లయితే..ఈ విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. శీతాకాలంలో ఫ్రిజ్‌ని ఏ ఉష్ణోగ్రతలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
చలికాలంలో రిఫ్రిజిరేటర్‌ను 1.7 నుండి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. దీనివల్ల ఆహారం పాడుకాదు. అంతేకాదు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అంటే కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది.
(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.)
ఇది కూడా చదవండి: మెదడు చురుగ్గా…గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ..ఈ డైట్ ఫాలో అవ్వండి..!!