Travel Guide : భారతదేశం రుచులకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులను భారతీయ వంటకాలు(Indian Food) ఎంతగానో ఆకట్టుకుంటాయనేది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’(Taste Atlas) లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది. ఎన్నో రకాల వంటకాలు, డ్రింక్స్‌కు వైబ్‌సైట్‌లో ప్రముఖ స్థానం కల్పించింది.
సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియా(Social Media) లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్(World Best Steve's) పేరుతో వెబ్‌సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో అందరికీ నోరూరించే ‘కీమా’(Keema) కి మొదటి పది స్థానాల్లో చోటుదక్కింది. బెంగాల్‌కు చెందిన ‘చింగ్రీ మలాయ్ కర్రీ’ 18వ స్థానంలో నిలవగా... కుర్మాకు 22, విందాలూ 26, దాల్ తడ్కా 30వ, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీ 34, మిసాల్ 38వ స్థానాలు దక్కించుకున్నాయి.
ఇక ఇండియన్ దాల్ చివరి స్థానంలో నిలిచింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు చెందిన వంటకాలకు చోటు దక్కింది. ఈ జాబితాలో థాయ్ ఫానెంగ్ కర్నీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన బెస్ట్ రైస్ పుడ్డింగ్ ర్యాంకుల్లో మూడు భారతీయ స్వీట్స్‌కి చోటు దక్కింది. ఫిర్నీకి 4వ, ఖీర్-పాయసం 5వ స్థానంలో నిలిచింది. చక్కెర పొంగలికి 9వ స్థానం లభించింది.
Also read: రానున్న ఐదు రోజులు వడగాలులు..బయటకు రావొద్దంటున్న అధికారులు!