Gandhi Sarovar: ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లోని గాంధీ సరోవర్‌పై హిమపాతం సంభవించింది. ఆదివారం ఉదయం 5 గంటలకు పర్వతం మీద నుంచి మంచు ఒక్కసారిగా కిందికి జారింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోగా వీడియో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు. పర్వతం మీద నుంచి మంచు కిందికి రావడంతో అలజడికి కారణమైందన్నారు. అలాగే జూన్ ప్రారంభంలో కేదార్‌నాథ్ ధామ్‌కు భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చినట్లు చెప్పారు. జూన్ 6 వరకు వారి సంఖ్య 7 లక్షలకు పైగా పెరిగిందని, ముఖ్యంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రితో కూడిన చార్ ధామ్ యాత్ర సర్క్యూట్‌లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా రెట్టింపు అవుతుందన్నారు. యాత్రికుల కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read: వరల్డ్ కప్ విజయం తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందంటే?