EX CM KCR: ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పు చూపించమని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈరోజుతో గడువు ముగియనుండటంతో కేసీఆర్ వలేఖ రాశారు.
అసలేమైంది..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఉహించకని షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు అందాయి. జస్టిస్ నర్సింహా రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లోపేర్కొన్నారు. కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.