ఏ పార్టీ అభ్యర్ధులు జాబితా అయినా… రకరకాల లెక్కలు వేస్తారు. మొదటి జాబితా, రెండో జాబితా అంటూ వాయిదాల పద్ధతిలో లిస్టులు ప్రకటిస్తారు. కానీ గులాబీ దళపతి మాత్రం ఒకేసారి 115 మంది అభ్యర్ధుల్ని ప్రకటించి ప్రత్యర్ధులకి మైండ్‌బ్లాక్ అయ్యే దెబ్బకొట్టారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 30 మంది సిట్టింగుల సీట్లు గల్లంతవుతాయంటూ తొలి నుంచీ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ప్రజల్లోనూ ఇదే ప్రచారం సాగింది. అయితే బీఆర్ఎస్ ప్రకటించిన 115 స్థానాల్లో 8 మందినే మార్చారు. అందులో ఒకటి… కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుండటం వల్ల మారిందే. మిగతా సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు బీఆర్ఎస్ బాస్. వివాదాలు మరీ ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే అభ్యర్ధులని మార్చారు కేసీఆర్.
మైండ్ బ్లాక్ ఐపోయిందిగా:
KCR plan: కేసీఆర్ దెబ్బ… ప్రతిపక్షాలు అబ్బా..! మాములుగా ఉండదు మరి!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే రాజకీయ చతురతకి మారుపేరు. ఆ విషయాన్ని మరోసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందరికంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్ధులు జాబితా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అంచనాలని తల్లకిందులు చేస్తూ ప్రకటించిన ఆ జాబితా కూడా సంచలనంగా మారింది.
Translate this News: