KCR plan: కేసీఆర్ దెబ్బ... ప్రతిపక్షాలు అబ్బా..! మాములుగా ఉండదు మరి!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే రాజకీయ చతురతకి మారుపేరు. ఆ విషయాన్ని మరోసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందరికంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్ధులు జాబితా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అంచనాలని తల్లకిందులు చేస్తూ ప్రకటించిన ఆ జాబితా కూడా సంచలనంగా మారింది.