KCR plan: కేసీఆర్ దెబ్బ... ప్రతిపక్షాలు అబ్బా..! మాములుగా ఉండదు మరి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే రాజకీయ చతురతకి మారుపేరు. ఆ విషయాన్ని మరోసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందరికంటే ముందే బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు జాబితా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అంచనాలని తల్లకిందులు చేస్తూ ప్రకటించిన ఆ జాబితా కూడా సంచలనంగా మారింది.

New Update
KCR plan: కేసీఆర్ దెబ్బ... ప్రతిపక్షాలు అబ్బా..! మాములుగా ఉండదు మరి!

ఏ పార్టీ అభ్యర్ధులు జాబితా అయినా... రకరకాల లెక్కలు వేస్తారు. మొదటి జాబితా, రెండో జాబితా అంటూ వాయిదాల పద్ధతిలో లిస్టులు ప్రకటిస్తారు. కానీ గులాబీ దళపతి మాత్రం ఒకేసారి 115 మంది అభ్యర్ధుల్ని ప్రకటించి ప్రత్యర్ధులకి మైండ్‌బ్లాక్ అయ్యే దెబ్బకొట్టారు. నిజానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దాదాపు 30 మంది సిట్టింగుల సీట్లు గల్లంతవుతాయంటూ తొలి నుంచీ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ప్రజల్లోనూ ఇదే ప్రచారం సాగింది. అయితే బీఆర్‌ఎస్ ప్రకటించిన 115 స్థానాల్లో 8 మందినే మార్చారు. అందులో ఒకటి... కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తుండటం వల్ల మారిందే. మిగతా సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు బీఆర్‌ఎస్ బాస్. వివాదాలు మరీ ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే అభ్యర్ధులని మార్చారు కేసీఆర్‌.

మైండ్‌ బ్లాక్‌ ఐపోయిందిగా:

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి... సిట్టింగులతోనే ఎన్నికల్లో పోటీ చేయాలని పదే పదే సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వాళ్లతో ఎన్నికలకు రాలేరని రేవంత్ అంచనా వేశారు. కానీ రేవంత్‌రెడ్డికి మతిపోయేలా ఉంది బీఆర్ఎస్ లిస్ట్. ఇక బీఆర్ఎస్ ప్లీనరీ సన్నాహక శిబిరంలోనూ... ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అంశం చర్చకు వచ్చింది. సిట్టింగుల పనితీరుపై మూడు సర్వేలు చేయించానని తెలిపారు సీఎం కేసీఆర్. చాలామందిపై అవినీతి మరక ఉందని, ఎన్నికల నాటికి గ్రాఫ్ పెంచుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనివల్లే చాలా మంది సీట్లకి ఎర్త్ పడుతుంది అనుకున్నారు. మరి ఈ మూడు నెలల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగిందా..? కేసీఆర్‌ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏంటి..? అనేది ప్రతిపక్షాలకి అంతుపట్టటడం లేదు.

అట్లుంటది కేసీఆర్‌తోని:

ఊహించని రేంజ్‌లో అభ్యర్ధుల జాబితా ప్రకటించి ప్రత్యర్ధి పార్టీలకి షాక్ ఇచ్చిన గులాబీ దళపతి... మరోవైపు టికెట్ దక్కని ఆశావహులకు కూడా భరోసా ఇచ్చారు. రాజకీయ జీవితం అంటే ఎమ్మెల్యే మాత్రమే కాదని తెలసుకోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకి ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశాలు వస్తాయన్నారు కేసీఆర్.
నోటిఫికేషన్ కూడా రాకుండానే అభ్యర్ధుల జాబితా ప్రకటించడం ద్వారా... ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలని కేసీఆర్ ఊహించని దెబ్బకొట్టారనే అనుకోవాలి. దీనికి కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందో చూడాలి. ఆ పార్టీలు ఎంత త్వరగా అభ్యర్ధుల్ని ప్రకటిస్తాయి అనేది ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది.

Advertisment
తాజా కథనాలు