KCR: బీఆర్ఎస్‌లోకి 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TS: మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని అన్నారు. ఇప్పుడే వద్దని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ మారిన వారు మళ్ళీ టచ్ లోకి వచ్చారని బాంబ్ పేల్చారు.

New Update
KCR: బీఆర్ఎస్‌లోకి 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..  మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

EX CM KCR: లోక్ సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని అన్నారు. ఇప్పుడే వద్దని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ మారిన వారు మళ్ళీ టచ్ లోకి వచ్చారని బాంబ్ పేల్చారు.

రేవంత్ వ్యవహారశైలి నచ్చక మళ్లీ తనతో టచ్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ మారిన వ్యక్తులను కాళ్లు మొక్కినా తిరిగి తీసుకోను అని తేల్చి చెప్పారు. మూడు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని ఎద్దేవా చేశారు. 102 ఎమ్మెల్యేలున్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేసిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంత సేపు అని కొత్త చర్చకు కేసీఆర్ తెర లేపారు.

కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదు, జనాల్లో కష్టపడాలని అన్నారు. రాబోయే రోజులు ముమ్మాటికి బీఆర్ఎస్‌వే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం అని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పై తొలిసారిగా కేసీఆర్ స్పందిస్తూ.. ఆ కేసు అంతా ఉత్తదే అని కొట్టి పారేశారు.

Advertisment
తాజా కథనాలు